మనం చలికి ఎందుకు వణుకుతామో తెలుసా?
మరికొన్ని రోజుల్లో చలికాలం రాబోతుంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిపోవడంతో చాలామంది గజగజా వణికిపోతుంటారు.
By అంజి Published on 13 Oct 2024 7:30 AM ISTమనం చలికి ఎందుకు వణుకుతాము?
మరికొన్ని రోజుల్లో చలికాలం రాబోతుంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిపోవడంతో చాలామంది గజగజా వణికిపోతుంటారు. అసలు చలికి మన శరీరం ఎందుకు వణుకుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం..
వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత వేరు వేరుగా ఉంటాయి. బయటి ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల మన శరీరంలో మనకు తెలియకుండా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే వాతావరణం చల్లగా మారినప్పుడు ఆ చలిని తట్టుకోవడానికి మన శరీరం ఉష్ణాన్ని విడుదల చేయాలనుకుంటుంది. దీంతో కండరాల సంకోచాన్ని వేగవంతం చేస్తుంది. అందుకే మనం గజగజ వణుకుతాము. మనకు జ్వరం వచ్చినప్పుడు కూడా వణుకుతాము.
ఎందుకంటే అప్పుడు శరీరంలోని అవయవాలకు రక్తం తగినంతగా అందదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి కూడా శరీరం కండరాల సంకోచాన్ని వేగవంతం చేస్తుంది. అందుకే చలిజ్వరం వచ్చినప్పుడు, చన్నీతో స్నాం చేసినప్పుడు కూడా మనం వణుకుతాము. అయితే దీనికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందకు డేవిడ్ మెక్‌మీ అనే శాస్త్రవేత్త ఎలుకపై ఓ ప్రయోగం చేశారు. దీని ప్రకారం.. వాతావరణం చల్లగా మారినప్పుడు టీఆర్‌పీఎం8 అనే ప్రొటీన్ శరీరంలో న్యూరాన్ ఫైబర్లను ఉత్తేజపరుస్తుంది. ఈ న్యురాన్లు మెదడుకు సిగ్నల్స్ పంపి.. శరీరాన్ని వణికేలా చేస్తాయి.