జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్‌ ఎందుకు?

నూతన సంవత్సరం జనవరి 1వ తేదీనే ఎందుకు ప్రారంభం అవుతుంది? ఈ రోజునే న్యూ ఇయర్‌ వేడుకలు ఎందుకు జరుపుకోవాలి? అని తెలుసుకోవాలంటే 2 వేల సంవత్సరాల వెనక్కి వెళ్లాలి.

By అంజి  Published on  30 Dec 2024 7:01 AM IST
New Year, January 1st, New Year 2025

జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్‌ ఎందుకు?

నూతన సంవత్సరం జనవరి 1వ తేదీనే ఎందుకు ప్రారంభం అవుతుంది? ఈ రోజునే న్యూ ఇయర్‌ వేడుకలు ఎందుకు జరుపుకోవాలి? అని తెలుసుకోవాలంటే 2 వేల సంవత్సరాల వెనక్కి వెళ్లాలి. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా.. క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో జులియస్‌ సీజర్‌, జూలియన్‌ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. అయితే రోమన్లకు జనవర నెల ముఖ్యమైనది. ఎందకంటే వారి దేవత జనస్‌ పేరిటే జనవరి నెల ఏర్పడింది. అందుకే జనవరి 1ని సంవత్సరాదిగా ఎంచుకున్నారు. అలా ఆ క్యాలెండర్‌ ప్రపంచమంతా విస్తరించింది. అయితే రోమన్ల సామ్రాజ్యం పతనం అయ్యాక క్రైస్తవం అధికారం చెలాయించింది.

దీంతో ఇంగ్లండ్‌ సహా చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ (దేవదూత గాబ్రియెల్‌.. మేరీకి కనిపించి క్రీస్తుఉ జననం గురించి చెప్పిన రోజు) కావాలి కోరుకున్నాయి. ఆ తేదీని సంవత్సరాదిగా నిర్వహించుకున్నాయి. కానీ ప్రపంచమంతా జులియస్‌ క్యాలెండర్‌నే ఫాలో అయ్యింది. అయితే జూలియస్‌ క్యాలెండర్‌లో 11 నిమిషాలు వ్యత్యాసం ఉందని పోప్‌ 13వ గ్రెగొరీ గమనించారు. కాలగణితంతో కొన్ని లెక్కలు వేసి 1570లో గ్రిగోరియన్ క్యాలెండర్‌ తీసుకొచ్చారు. ఇందులోనూ జనవరి 1వ తేదీనే సంవత్సరాదిగా నిర్ణయించారు. దీని కచ్చితత్వాన్ని ప్రపంచమంతా అంగీకరించడంతో క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు.

Next Story