మరణించినవారి ఐడీలు ఏం చేయాలో తెలుసా?
భారతదేశ పౌరులందరికీ ఆధార్ కార్డు నుంచి పాస్‌పోర్ట్ వరకు.. ఇలా ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పకుండా ఉంటుంది.
By అంజి Published on 2 Jan 2025 9:23 AM ISTమరణించినవారి ఐడీలు ఏం చేయాలో తెలుసా?
భారతదేశ పౌరులందరికీ ఆధార్ కార్డు నుంచి పాస్‌పోర్ట్ వరకు.. ఇలా ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పకుండా ఉంటుంది. అయితే ఓ వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులను కుటుంబ సభ్యులు సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మన దేశంలో ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్. ఎల్‌పీజీ సబ్సిడీ, ఈపీఎఫ్, అకౌంట్స్ వంటి సేవలకు లింక్ చేసి ఉంటుంది. అయితే మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును డియాక్టివేట్ చేయడం లేదా క్యాన్సల్ చేయడం కుదరదు. వారి ఆధార్ దుర్వినియోగం కావొద్దంటే కుటుంబ సభ్యులు బయోమోట్రిక్ డేటాను లాక్ చేయాల్సి ఉంటుంది.
అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహించాలంటే పాన్ కార్డు తప్పనిసరి. అందుకే ఐటీఆర్ ఫైలింగ్, బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేయించుకునేవారు పాన్‌కార్డ్‌ను సేఫ్‌గా ఉంచాలి. ఆ తర్వాత డెత్ సర్టిఫికెట్ కాపీతో పాన్‌ను సరెండర్ చేయాలి.
ఒక వ్యక్తి మరణించిన తర్వాత పాస్‌పోర్ట్ సరెండర్ చేయకపోయినా ఏం కాదు. ఎందుకంటే దానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది ముగిసిన తర్వాత పాస్‌పోర్ట్ ఎలాగూ చెల్లదు.
మరణించిన వ్యక్తి ఓటరు కార్డును కుటుంబ సభ్యులు క్యాన్సల్ చేయించాలి. ఫారం 7, డెత్ సర్టిఫికెట్ కాపీలతో లోకల్ ఎలక్షన్ ఆఫీస్‌కు వెళ్తే వారు ఓటర్ లిస్ట్ నుంచి మరణించిన వారి పేరును తొలగిస్తారు.