130 ఏళ్ల చరిత్ర కలిగిన 'కాకినాడ కాజా' గురించి ఈ విషయాలు తెలుసా?

తూర్పు గోదావరి జిల్లాలో మీది ఏఊరు అని అడిగేవారంతా అవతలివారు చెప్పే సమాధానం కోసం ఆశగా ఎదురుచూస్తారు.

By అంజి  Published on  28 May 2023 7:34 AM GMT
Kakinada Kaja, East Godavari, Kotaiah, sweet

130 ఏళ్ల చరిత్ర కలిగిన 'కాకినాడ కాజా' గురించి ఈ విషయాలు తెలుసా?  

తూర్పు గోదావరి జిల్లాలో మీది ఏఊరు అని అడిగేవారంతా అవతలివారు చెప్పే సమాధానం కోసం ఆశగా ఎదురుచూస్తారు. ఎందుకో తెలుసా? వ్యక్తుల కోసం కాదు.. అక్కడ బాగా ఫేమస్‌ అయిన కాకినాడ కాజా కోసం. భారత్‌లో కాకినాడ కాజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాజాతో ఉన్న ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును కూడా భారత తపాలా శాఖ విడుదల చేసింది.

కాకినాడ కాజాగా ఎందుకు ఫేమస్‌?

1891లో కాకినాడకు చెందిన కోటయ్య తొలిసారిగా ఈ కాజాను తయారు చేసి.. దాని రుచుకి సుచికి చక్కటి గుర్తింపు వచ్చేలా చేశారు. మొదట్లో అంతా కోటయ్య కాజా అని పిలిచేవారు. అదికాస్తా కాలక్రమంలో కాకినాడ కాజాగా రూపాంతరం చెందింది.

ఇది ప్రత్యేకత

సాధారణంగా కాజా అంటే మడతలు చుట్టి ఉంటుంది. కానీ కాకినాడ కాజా మాత్రం గుండ్రంగా, నున్నగా ఉంటుంది. లోపల దాని పొట్టనిండా తియ్యని పాకం నిండి ఉంటుంది.

కాకినాడ వెళ్తే కాజానే..

కాకినాడ ఎప్పుడు వెళ్లినా.. ఎవరైనా తెలిసిన వారు వెళ్లినా ముందుగా కాకినాడ కాజా తేవొయ్ అంటూ ముఖం మీద అడిగేడయం పరిపాటి. 1891లో ప్రారంభమైన తమ ప్రస్థానం నేటికీ అంతే ఉత్సాహంతో కొనసాగుతోందని కోటయ్య అయిదో తరం వారసులు చెబుతున్నారు.

విదేశాల్లోనూ డిమాండ్

భారత దేశంలోనే కాదు ఖండాంతరాలు దాటింది కాజా టేస్ట్. విదేశాల్లో ఉన్న తెలుగువారు కాకినాడ లేద చుట్టు పక్కల ప్రాంతాల వారితో కొరియర్‌ చేయించుకుని మరీ కాజా టేస్ట్‌ను ఆస్వాదిస్తున్నారు.

Next Story