కారు వాస్తు గురించి తెలుసా?
స్థలవాస్తు గురించి, ఇంటి వాస్తు గురించి విన్నాం.. కానీ, కారు వాస్తు ఏంటీ? అది ఒక్కచోట స్థిరంగా ఉండదు కదా అని అనుకుంటున్నారా?
By అంజి Published on 24 May 2024 10:44 AM GMTకారు వాస్తు గురించి తెలుసా?
స్థలవాస్తు గురించి, ఇంటి వాస్తు గురించి విన్నాం.. కానీ, కారు వాస్తు ఏంటీ? అది ఒక్కచోట స్థిరంగా ఉండదు కదా అని అనుకుంటున్నారా?. అవును మీరు అనుకునేది నిజమే. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం.. కారు కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదమని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి కారులో ఏ వస్తువు ఉంచితే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలసుకుందామా..
- కారులో కేతువుకు సంబంధించిన చిన్న వినాయకుడి లేదా హనుమంతుడి విగ్రహం ఉంచితే.. ఎలాంటి అడ్డంకులు రావట. ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది. అలాగే గణపతి అన్ని అడ్డంకులను అధిగమిస్తాడని నమ్ముతారు.
- కారులో చైనీస్ నాణేలు వేలాడదీస్తే.. ప్రతికూలతలను తొలగిస్తాయట
- కారులో ఉప్పు, బేకింగ్ సోడాను కలిపి పోట్లంగా చుట్టి సీటు కింద ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీని తొలగించడంతో పాటు పురుగుపుట్రను చేరనివ్వదు.
- కారులో నెమలి ఈకలు లేదా దుర్గామాతకు ఇష్టమైన చున్నీ ఉంచితే.. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు కారులో అందంగా కనిపిస్తాయి.
- కారులో చిన్న తాబేలు బొమ్మను ఉంచడం వల్ల శుభం జరుగుతుందట. అలాగే వెళ్లే పనులు సఫలం అవుతాయట.
- కారులో ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. నీటి మూలకం కారులో ఉంటే అది అదృష్టాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది కారులోని చెడు శక్తిని తొలగిస్తుంది.