భారత్‌లో ఉండే ఫేమస్ ఐలాండ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది లక్షద్వీప్, అక్కడ ఉండే బ్యూటీఫుల్ బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్ అద్భుతంగా ఉంటాయి. ఇక అక్కడి ఐలాండ్‌లు ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. మనకు ప్రకృతి అందాలను పరిచయం చేసే లక్షద్వీప్‌లోని కొన్ని ఐలాండ్స్, వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..
అగత్తి ఐలాండ్
అందమైన బీచ్‌లకు, సాంప్రదాయ ఆహార పదార్థాలకు ఈ అగత్తి ఐలాండ్ ఫేమస్. స్నోర్ కెల్లింగ్, కయాకింగ్, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి.
బంగారం ఐలాండ్
లక్షద్వీప్‌లోని అతి చిన్న ఐలాండ్ ఇది. అడ్వంచర్స్‌తో పాటు, తక్కువ జనాభాతో ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఇది బెస్ట్ స్పాట్. బంగారం ఐలాండ్, పక్కనే ఉన్న కద్మత్ ఐలాండ్ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పవచ్చు.
మెరైన్ మ్యూజియం
మెరైన్ మ్యూజియం కవరత్తిలో ఉంటుంది. సముద్ర కళాఖండాలతో పాటు సముద్ర జీవుల జీవితం ఎలా ఉంటుందో కళ్లారా చూడాలంటే.. ఈ మ్యూజియానికి వెళ్లాల్సిందే.
ఆండ్రెట్టి ఐలాండ్
లక్షద్వీప్‌లోని అతి పెద్ద ఐలాండ్ ఇది. ఇక్కడ అన్ని రకాల వాటర్ స్పోర్ట్స్‌తో పాటు బౌద్ధ పురావస్తు అవశేషాలు, సెయింట్ హజ్రత్ ఉబైదుల్లా సమాధి కూడా ఉంటుంది. ఈ బీచ్ నిత్యం టూరిస్టులతో కళకళలాడుతుంటుంది.