తెలుగు రాష్ట్రాల్లో రంగుల హోలీ.. ఎలా జరుపుతారో తెలుసా?

నేడు హోలీ పండుగ. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అనికూడా పిలుస్తారు.

By అంజి  Published on  25 March 2024 2:24 AM GMT
Holi festival, Telugu states , Holi

తెలుగు రాష్ట్రాల్లో రంగుల హోలీ.. ఎలా జరుపుతారో తెలుసా?

నేడు హోలీ పండుగ. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అనికూడా పిలుస్తారు. ఈ పండగకి దేశం అంతా రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల్లోల మునిగి తేలుతారు. హోలీకా దహన్‌ లేదా కామ దహన్‌గా రాత్రి మంటతో ప్రారంభం అయ్యి.. తెల్లవారగానే ఊరంతా తిరుగుతూ రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. అలాగే పట్టణాల్లో ప్రజలందరూ ఓ చోట చేరి రంగులు చల్లుకుంటూ.. రెయిన్‌ డ్యాన్స్‌లు వేస్తారు. శీతాకాలానికి చివరన వసంత రుతువుకు ఆరంభంగా హోలీని పాల్ఘుణ మాసం పౌర్ణమి నాడు జరపడం ఆనవాయితీగా వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో హోలీని.. మెదురు హోలీ అని కూడా అంటారు. ఈ రోజున ఊర్లలో రింగిస్‌ బిళ్ల జాజిరి పాటలు చాలా ఫేమస్‌. చెడు దృష్టి పోవాలని, మంచి మార్గం చూపాలంటూ కాముడి దహనం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ పండుగ కోసం ఎదురుచూసేవారు చాలా మంది ఉంటారు. చిన్న పిల్లలు ఖాళీ కూల్‌ డ్రింక్‌ బాటిల్‌లో రంగులు కలిపిన నీటితో కనిపించినవారి మీద చల్లడానికి సిద్ధంగా ఉంటారు. స్నేహితులు తలపై గుడ్లను కొడతారు.

హోలీ ముందు రోజు రాత్రి ఊర్లో యువకులు అంతా డప్పు చప్పుళ్లతో ఇంటింటికీ తిరుగుతూ కర్రలు సేకరిస్తారు. కర్రలన్నీ ఒక్కచోట పేర్చి పెద్ద మంట వేస్తారు. బూడిదయ్యే వరకు చలి కాచుకుంటారు. దీంట్లో సేకరించిన బూడిదను ఇంటి పరిసరాల్లో కొందరు పంట పొలాల్లో చల్లుతారు. ఇలా చేయడం వల్ల చెడు శక్తులు పోతాయని నమ్ముతారు. దీన్నే కాముని మంటగా పరిగణిస్తారు. కొన్ని శాస్త్రాల ప్రకారం మన్మథుడిని మహాశివుడు భస్మం చేసిన రోజుగా కూడా భావిస్తారు. ఈ ఒక్క రోజు ఆయన భూమిపైకి వస్తాడని విశ్వసిస్తారు.

Next Story