ఏటీఎం కార్డు బీమా అంటే తెలుసా?

లైఫ్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌, వెహికల్‌ ఇన్సూరెన్స్‌ గురించి అందరికీ తెలిసిందే. వాటికి మనం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

By అంజి  Published on  2 Jun 2024 11:15 AM GMT
ATM card, insurance, Free insurance, Bank

ఏటీఎం కార్డు బీమా అంటే తెలుసా?

లైఫ్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌, వెహికల్‌ ఇన్సూరెన్స్‌ గురించి అందరికీ తెలిసిందే. వాటికి మనం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఏటీఎం కార్డు ఉంటే ఇన్సూరెన్స్‌ కవరేజీ పొందొచ్చని మీలో ఎంత మందికి తెలుసు? దాని కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పని కూడా లేదు. ఫ్రీగానే బీమా కవరేజీ లభిస్తుంది. మీరు ఏడాదికోసారి చెల్లించె కార్డ్‌ ఛార్జీలోనే బీమా ఛార్జీలు కూడా కలిసి ఉంటాయి. ముఖ్యంగా మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే ఐదు రకాల బీమాలను ఉచితంగా పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఉచిత బీమాలివే

డెబిట్‌ కార్డు ద్వారా ఎవరైనా మీ డబ్బును దొంగిలిస్తే ఇన్సూరెన్స్‌ కవరేజీని క్లైమ్‌ చేసుకోవచ్చు.

డెబిట్‌ కార్డు వినియోగదారుడు ప్రమాదానికి గురై మరణిస్తే.. నిర్ణీతకాలంలోపు వారి కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్‌ బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

విమాన ప్రయాణంలో ప్రమాదం జరిగినా, మరణం సంభవించినా ఇన్సూరెన్స్‌ కవరేజీ వర్తిస్తుంది. అయితే ఆ విమాన ప్రయాణ టికెట్‌ డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేసి ఉండాలి.

డెబిట్‌ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువులు పోయినా, చోరీకి గురైనా బీమా కవరేజీ పొందవచ్చు.

ప్రయాణంలో మీ లగేజీ పోయినా లేదా ఏదైనా కారణంతో పాడైపోయినా, ధ్వంసమైనా బీమా పొందే అవకాశం ఉంది.

Next Story