శ్రీ కృష్ణుడికి చెందిన ఈ మిస్టరీ ఆలయం గురించి తెలుసా?
కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి ఒక జన్మ చాలదని అంటుంటారు. కృష్ణుడికి సంబంధించిన బృందావనం ఒక పవిత్ర స్థలం.
By అంజి Published on 30 Jun 2024 1:00 PM GMTశ్రీ కృష్ణుడికి చెందిన ఈ మిస్టరీ ఆలయం గురించి తెలుసా?
కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి ఒక జన్మ చాలదని అంటుంటారు. కృష్ణుడికి సంబంధించిన బృందావనం ఒక పవిత్ర స్థలం. అందుకే ఇక్కడ నిధివన్ అనే ఆలయం ఉంది. అందలో ఒక మిస్టరీ కూడా దాఇ ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాడట. ఇప్పుడు కూడా రాధాకృష్ణులు ప్రతి రోజు ఇక్కడికి వస్తుంటారనేది భక్తుల నమ్మకం. అంతేకాదు.. గోపికలతో కలిసి నాట్యం కూడా చేస్తుంటారట. అందుకే ప్రతి రోజు సాయంత్రం హారతి ఇచ్చిన తర్వాత ప్రధాన ఆలయం ద్వారాలకు తాళం వేస్తారు. చీకటి పడిందంటే.. పూజారులు కూడా అటువైపు వెళ్లరట. నిధివన్ ఆలయం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం.. రండి..
ఆలయం చుట్టు కాపలా..
ఈ బృందావనంలోని ఆలయం లోపల రాధాకృష్ణులు ఉన్నంతసేపు ఆలయం చుట్టూ అతని సేనలు కాపలా కాస్తాయి. కాకపోతే, వాళ్లు అదృశ్యరూపంలో ఉండటం వల్ల ఎవరికీ కనిపించరట. కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగనీయరట. ఒకవేళ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఉత్సుకతో ఎవరైనా అటువైపు వెళ్తే.. వెళ్లిన వారు చనిపోవడమే, మతిస్థిమితం కోల్పోవడమో జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇలా చాలా మందికి జరిగిందని కథలు కథలుగా చెప్తుంటారు.
వింతైన చెట్లు
నిధివన్ ఆలయ ప్రాంగణంలో కొన్ని చెట్లు వింతగా ఉంటాయి. సాధారణంగా చెట్ల కొమ్మలు పైవైపుకు ఉంటాయి. కానీ ఇక్కడి చెట్టుకు కొమ్మలు కింది వైపుకు వేలాడుతుంటాయి. చెట్లు కూడా చాలా పొట్టిగా, ఒకదానికొకటి అల్లుకొని ఉంటాయి. తులసి మొక్కలు కూడా జంటగా ఉంటాయి. ఈ తులసి మొక్కలు రాత్రిపూట గోపికలుగా మారతాయని కొందరు చెబుతున్నారు. అంతేకాదు.. నిధివన్‌కు దగ్గర్లో ఒక బావి ఉంది. రాధ దాహాన్ని తీర్చడం కోసం కృష్ణుడు స్వయంగా తన వేణువుతో ఆ బావిని నిర్మించాడని చెప్తుంటారు.