వెలుగును చిమ్మే ఈ జీవులు మీకు తెలుసా?
చిమ్మచీకటి లాంటి జీవితంలో మిణుగురు వెలుగులాంటి చిన్న ఆశ ఉంటే దాన్ని పారదోలవచ్చని ప్రతీసారి ఈ పురుగును పోల్చి చెబుతాం కదా.. అలా చీకట్లో వెలుతురు చిమ్మే మరికొన్ని జీవులూ ఉన్నాయి.
By అంజి Published on 15 Jan 2024 12:00 PM ISTవెలుగును చిమ్మే ఈ జీవులు మీకు తెలుసా?
చిమ్మచీకటి లాంటి జీవితంలో మిణుగురు వెలుగులాంటి చిన్న ఆశ ఉంటే దాన్ని పారదోలవచ్చని ప్రతీసారి ఈ పురుగును పోల్చి చెబుతాం కదా.. అలా చీకట్లో వెలుతురు చిమ్మే మరికొన్ని జీవులూ ఉన్నాయి. అవేంటో తెలుసా? తుమ్మెదల జాతికి చెందిన ఫైర్ ఫ్లైస్ అనే చిన్న పురుగులు వేసవిలో వాటికున్న ప్రత్యేకతతో వెలుగును చిమ్ముతాయి. సముద్రాల్లోనే జీవించే జెల్లీ ఫిష్‌లు తమ కుటుంబం మధ్య కమ్యునికేషన్ కోసం ఫొటోపోర్స్ అనే ప్రత్యేక కణాల ద్వారా వెలుగును ప్రసరింప చేయగలవు.
ఫ్లూరోసెంట్ జాతికప్పలు చీకట్లో వెలగిపోతాయి. ఈ జాతి కప్పల్లో అనేక రకాలు ఉంటాయి. దండకారణ్యంలో ఆకుల చాటున ఇవి జీవిస్తూ ఉంటాయి. వివిధ దేశాలలో ఇవి ఒక్కో రకంగా కనపడుతుంటాయి. ఈ కప్పల్లో ఒల్లంతా రేడియం పూసుకున్నట్టుగా ఉండేవి ఎక్కువగా అమెజాన్ అడవుల్లో జీవిస్తాయి. ఇవి రంగులతో కార్టూన్ బొమ్మల్లా, ఎర్రటిరంగుతోని పెద్ద పెద్ద కళ్లతో కొమ్మలపై వేలాడుతుంటాయి. అలాగే బ్రెజిల్ కనిపించే మరోరకం కప్పలు కాషాయరంగులో 3 నుంచి 4 సెంటీమీటర్లు మాత్రమే పొడవు ఉండి గెంతుతూంటాయి. మరికొన్ని చోట్ల వెలిగిపోతుంటాయి.
మనం చిన్నతనంలో ఆడుకున్న తూనీగలలో కూడా మెరిసేవి ఉన్నాయి. వాటి శరీరంలోని జీవకాంతి ద్వారా అవి మెరుస్తాయి. ఈ మెరుపు వాటి జతను వెతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే సముద్రంలో ఉండే సొరజాతికి చెందిన కొన్ని చిన్న చిన్న చేపలు సముద్రపు అడుగు భాగాన ఉంటాయి. ఇవి కూడా రంగులద్దుకున్నట్టు ఉంటాయి.
మనందరికీ తెలిసిన మిణుగురు పురుగులు, ఇందులోనూ కొన్ని రకాలు ఉంటాయి. ఎగిరేవి కొన్ని ఉంటే గుహల్లో పాకేవి మరికొన్ని. ఈ పాకే మినుగురులు ఎర్రరంగను ప్రసరింప చేస్తాయి. సముద్రంపైన కొన్ని చోట్ల నాచు రూపంలో ఉండే డైనోఫ్లాగెల్లేట్‌లు బయోల్యూమినిసెన్స్ ఆధారంగా మెరుస్తాయి. ఇందులో ఉండే చిన్న చిన్న శైవలాలు కేవలం రాత్రి పూటే కాంతిని ప్రసరింపజేస్తాయి. వీటికి నిర్ణీత ఆకృతి ఉండదు. ఇవి కాంతిని మరో జీవితో సహజీవనం చేసి పొందుతాయి.
సముద్ర గర్భంలో ఉండే ఆంగ్లర్‌ఫిష్ దాని తలపై తోక ఆకృతిలో ఉండే దాని గుండా కాంతిని ప్రసరింపజేస్తుంది. ఈ చేప చూడటానికి భయంకరంగా ఉంటుంది. వీటితోపాటే ఓ రకమైన సముద్రపు పురుగుల శిలాజం అంతా మెరుస్తూ ఉంటుంది. వీటిని చూస్తే.. ఎముకలు మాత్రమే ఉన్నట్టుగా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇలా ప్రపంచంలోని రకరకాల జంతువులు అవసరానికి కాంతిని వెదజల్లుతూ వాటి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.