మీ వాహనానికి థర్డ్‌ పార్టీ బీమా ఉందా?.. క్లెయిమ్‌ ఎలా పొందాలో తెలుసా?

దేశంలో వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరూ వెహికల్ ఇన్సూరెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ట్రాఫిక్‌ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి మొక్కుబడిగా ఏదో ఒక ఇన్సూరెన్స్‌ తీసుకొని సరిపెట్టుకుంటారు.

By అంజి  Published on  26 Sept 2024 1:05 PM IST
third party insurance, vehicle, claim, Vehicle Insurance

మీ వాహనానికి థర్డ్‌ పార్టీ బీమా ఉందా?.. క్లెయిమ్‌ ఎలా పొందాలో తెలుసా?

దేశంలో వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరూ వెహికల్ ఇన్సూరెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ట్రాఫిక్‌ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి మొక్కుబడిగా ఏదో ఒక ఇన్సూరెన్స్‌ తీసుకొని సరిపెట్టుకుంటారు. అయితే, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో మనం ముందే చెప్పలేము. మన వల్ల ఇతరులకు ప్రమాదం జరగొచ్చు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూడా మనం నష్టపోవచ్చు. అలాంటి సమయాల్లో బీమా కంపెనీలు.. నిబంధనల్లో ఇవేవీ లేవని మీ బీమాను తిరస్కరిస్తుంటాయి. అందుకే.. అన్నీ ఆలోచించుకున్నాకే ఒక సమగ్ర పాలసీ తీసుకోవాలి.

థర్డ్‌ పార్టీ బీమా

కారు, బైక్‌ ఇన్సూరెన్స్‌లలో థర్డ్‌ పార్టీ బీమా చాలా ముఖ్యమైనది. ఇందులో ఇన్సూరెన్స్‌ కొన్న వారు ఫస్ట్‌ పార్టీ అయితే.. ఇన్సూరెన్స్‌ అమ్మిన వారు సెకండ్‌ పార్టీ అవుతారు. ఒక వేళ మీ వాహనం వల్ల ఏదైనా ప్రమాదం జరిగి నష్టపోయిన లేదా చనిపోయిన వారిని థర్డ్‌ పార్టీ అని పిలుస్తారు. ఒక వేళ ఆ థర్డ్‌ పార్టీ వ్యక్తికి ఇన్సూరెన్స్‌ లేకపోతే.. ఆ భారమంతా వాహనదారుడే మోయాలి. కనుక ఈ బీమా తప్పనిసరిగా తీసుకోవడం మంచిది.

క్లెయిమ్‌ ఎలా పొందాలి?

ప్రమాదం జరిగిన వెంటనే బీమా కంపెనీకి చెప్పాలి. నిర్దిష్ట సమయంలోగా వారికి సమాచారం ఇవ్వకపోతే.. మీరు ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేయలేరు. అలాగే పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా పొందాలి. మీరు సమర్పించే పత్రాలకు ఆ ఎఫ్‌ఐఆర్‌ కాపీని జత చేయాలి. ఆ తర్వాత ప్రమాద నష్టాన్ని అంచనా వేయడానికి బీమా కంపెనీ సర్వే కోసం ఒకరిని పంపిస్తుంది. వారి నివేదికను బట్టి క్లెయిమ్‌ వస్తుంది.

ఈ జాగ్రత్తలు అవసరం

అందుబాటులో ఉన్న వివిధ రకాల మోటార్‌ ఇన్సూరెన్స్‌లను క్షున్ణంగా పరిశీలించండి. ఆ తర్వాత మీకు ఏది బెటర్‌ అనిపించిందో దాన్ని బట్టి ఓ నిర్ణయానికి రావాలి. మీరు ఇన్సూరెన్స్‌ తీసుకునే ముందు క్యాష్‌లెస్‌ గ్యారేజ్‌ నెటవర్క్స్‌, ప్రీమియం ధరలు, యాడ్‌ ఆన్‌ ఫీచర్లు, బీమా సంస్థకున్న విశ్వసనీయత, కవరేజీ వంటి వాటిని కచ్చితంగా ప్రామాణికంగా తీసుకోవాలి. అయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారు వాహనం నడిపినా, మద్యం సేవించి వాహనం డ్రైవ్‌ చేసినా నిబంధనలు ఉల్లంఘించినట్టవుతుంది. దీంతో కవరేజీలు వర్తించవు.

Next Story