ఒకే కాలనీలో 19 మందికి ఎయిడ్స్.. ఆ మహిళే కారణం..!
ఉత్తరాఖండ్ రాంనగర్ ప్రాంతంలో ఓ యువతీకి ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉంది.
By Kalasani Durgapraveen Published on 2 Nov 2024 6:43 AM ISTఉత్తరాఖండ్ రాంనగర్ ప్రాంతంలో ఓ యువతీకి ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉంది. ఆమెకు వివాహం జరిగినప్పటికీ.. ఆమె అలవాట్లు చూసి భర్త విడాకులు ఇచ్చాడు. తర్వాత ఆమె ప్రవర్తన మరింత విచ్చలవిడిగా తయారైంది. ఆమె చాలా మంది తో లైంగిక సంబంధాలు పెట్టుకుంది. మొత్తం 19 మందితో ఆమె రాసలీలలు కొనసాగించింది.
ఆమెకు మాదకద్రవ్యాలు తీసుకోవడం అలవాటుగా మారడంతో వాటిని ఆశగా చూపి చాలామంది.. ఆమెను లోబరుచుకున్నారు. దీంతో ఆమెకు హెచ్ఐవీ సోకింది. 19 మందితో ఆమె "ఆ " కార్యకలాపలు సాగించింది. వారిని ఇటీవల వైద్యులు పరీక్షించగా వారందరికీ హెచ్ఐవీ సోకినట్టు తేలింది. సాధారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రతి ఏడాదికి 20 హెచ్ఐవి కేసులు వస్తుంటాయి. అయితే రాంనగర్ ప్రాంతంలో ఒకేసారి 19 మందికి హెచ్ఐవి సోకినట్టు నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్యశాఖ షాక్ కు గురైంది. రాంనగర్ ప్రాంతంలో గడచిన 17 నెలల్లో 45 కేసులు బయటపడటం అధికారులను షాక్ గురిచేసింది.
హెచ్ఐవి సోకిన వారిలో చాలామంది వివాహం అయిన వారే ఉన్నారు. అయితే ఆ అమ్మాయి వల్ల వారికి హెచ్ఐవి సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఆమె కూడా హెచ్ఐవి ఉందని.. దానిని నియంత్రణలో ఉంచుకోవడానికి ఆమె మందులు వాడుతోంది. అయితే ఆమెకు ఉన్న మాదకద్రవ్యాల అలవాటును మానిపించడానికి అధికారులు డి అడిక్షన్ సెంటర్ కి పంపించారు. వైద్యశాఖ అధికారులు విచ్చలవిడి లైంగిక సంబంధాల వల్ల జరిగే అనర్ధాల గురించి రాంనగర్ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు.