నెలకు రెండుసార్లు పీరియడ్ వస్తోందా?
నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక భాగం. సాధారణంగా నెలసరి 28 - 35 రోజుల మధ్యలో వస్తుంది.
By అంజి
నెలకు రెండుసార్లు పీరియడ్ వస్తోందా?
నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక భాగం. సాధారణంగా నెలసరి 28 - 35 రోజుల మధ్యలో వస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఉంటుంది. ఫలితంగా నెలకోసారి రావాల్సిన పీరియడ్స్.. రెండు లేదా మూడు వారాలకోసారి రావడం, లేదా నెలన్నరకుపైగా రాకపోవడం వంటివి జరుగుతాయి. అయితే ఒకే నెలలో రెండుసార్లు పీరియడ్స్ రావడం సహజమే కానీ.. కొంతమందిలో మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పలు అసాధారణ సమస్యలకూ కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల నెలలో రెండుసార్లు పీరియడ్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గర్భాశయ లోపలి పొరను పోలిన పొర దాని బయట పెరగడం వల్ల ఈ సమస్య వస్తుందని అంటున్నారు. అలాగే మోనోపాజ్ సమయంలో, థైరాయిడ్ గ్రంథి హెచ్చు తగ్గుల వల్ల, అప్పుడే రజస్వల అయిన అమ్మాయిల్లోనూ ఇలా కావొచ్చంటున్నారు నిపుణులు. అయితే మూడు నెలలకు పైగా నెలలో రెండు సార్లు పీరియడ్స్ వచ్చినా, గంట గంటకూ శ్యానిటరీ ప్యాడ్ మార్చుకునేంత ఎక్కువ రక్తస్రావం అయినా, గడ్డల మాదిరిగా బ్లీడింగ్ అయినా, అలసట, పొత్తి కడుపు/ వెజైనా దగ్గర నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.