వాలెంటైన్స్‌ వీక్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

క్యాలెండర్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ డే ఏదని ఎవరిని అడిగినా ఫిబ్రవరి 14 అని తడుముకోకుండా చెప్పేస్తారు. వాలంటైన్స్‌ డే అనే పదం వినగానే ఎవరి పెదవుల మీదైనా చిరునవ్వు వెల్లివిరుస్తుంది.

By అంజి  Published on  4 Feb 2024 9:47 AM IST
Valentine week, Valentine Day, February

వాలెంటైన్స్‌ వీక్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

క్యాలెండర్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ డే ఏదని ఎవరిని అడిగినా ఫిబ్రవరి 14 అని తడుముకోకుండా చెప్పేస్తారు. వాలంటైన్స్‌ డే అనే పదం వినగానే ఎవరి పెదవుల మీదైనా చిరునవ్వు వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా ప్రేమికులకు ఈ రోజు చాలా ప్రత్యేకం. వన్‌ సైడ్‌ లవర్స్‌ తాము ప్రేమిస్తున్నవారికి ఈ రోజునే ప్రపోజ్‌ చేయాలని ఎదురుచూస్తుంటారు. పైగా ఈ రోజున చెబితే కాదనరని ఓ నమ్మకం. ఇది పాశ్చాత్య దేశాల సంస్కృతి నుంచి వచ్చినా.. ప్రతి ప్రేమ జంటను పలకరిస్తుంది. వాలంటైన్స్‌ డేని వాలంటైన్స్‌ వీక్‌గా 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో స్పెషల్‌ డేగా ప్రేమికులు జరుపుకుంటారు.

వాలంటైన్స్‌ వీక్‌లో మొదటి రోజు అంటే 7వ తేదీని రోజ్‌ డేగా జరుపుకుంటారు. ఆ రోజు ఇష్టమైన వారికి రోజ్‌ ఫ్లవర్ అందిస్తారు. అది కూడా రెడ్‌ రోజ్‌ మాత్రమే ఇస్తారు. రెండో రోజు ప్రపోజ్‌ డే.. వాలంటైన్స్‌ వీక్‌ గురించి తెలిసిన వారు ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరికి నచ్చినట్టు వారు ప్రపోజ్‌ చేస్తారు. ఇక మూడో రోజు చాక్లెట్‌ డే.. ఇది అమ్మాయిలకి చాలా ప్రత్యేకం ఎందుకంటే చాక్లెట్‌ ఇష్టపడని వారు ఎవరుంటారు. ప్రేమించే అబ్బాయి ఇచ్చే చాక్లెట్స్‌ కోసం ఎదురు చూస్తూంటారు. నాలుగో రోజు టెడ్డీ డేగా జరుపుకుంటారు. అమ్మాయిలకి టెడ్డీస్‌ ఎంత ఇష్టమో వేరే చెప్పాల్సిన పని లేదు. ఐదవ రోజు ప్రామిస్‌ డే.. ఏ బంధం అయినా ధృడంగా నిలబడాలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి.

జీవితం అంతా తనతో ఎలా ఉండబోతున్నారో నమ్మకాన్ని కలిగించాలి. జీవితాంతం దానికే కట్టుబడి ఉంటానని మాటివ్వాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఆరవ రోజు హగ్‌ డే.. బాధలో ఉన్నప్పుడు దగ్గరి వారిని గుండెలకు హత్తుకుంటే భారం అంతా తీరుతుంది. ఓ జీవిత భాగస్వామి సమస్యలు మరిచిపోయేలా కౌగిలించుకుని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేయండి. ఎడవ రోజు కిస్‌ డే.. ఈ రోజున ప్రేమించే వ్యక్తికి ముద్దు పెట్టి ప్రేమను వ్యక్తం చేస్తారు. నుదిటి మీద పెట్టే ముద్దు కేరింగ్‌కి చిహ్నంగా చెబుతారు. అయితే ప్రేమను వ్యక్త పరిచే స్వేచ్ఛ ఉందని చెప్పడానికే ఈ రోజులన్నీ.. అంతేకానీ ఇబ్బంది పెట్టే హక్కు మాత్రం ఎవరికీ ఉండదు. ప్రపోజ్‌ చేస్తే అంగీకరించకుంటే కారణాలు తెలుసుకుని, వారి ఆలోచనలను గౌరవించాలి.

Next Story