నేడు రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. పౌర్ణమి వేళ సూర్య, చంద్రులు, భూమి ఒకే సరళ రేఖలోకి రానున్నారు. దీంతో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మన భారతదేశంలోనూ కనిపించనుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే దీన్ని మనం నేరుగా చూడొచ్చట. ఎలాంటి పరికరాల అవసరం లేకుండా డైరెక్ట్ గా వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బైనాక్యులర్ సాయంతో చూస్తే ఇంకా మంచి అనుభూతి కలుగుతుందట. ఈ రోజు రాత్రి 9.57 గంటల నుంచి తెల్లవారుజామున 1.26 గంటల వరకు ఈ చంద్ర గ్రహణం కొనసాగనుంది.
ఈ టైమ్‌లో మనం చందమామను చూస్తే కోతకు గురవుతున్నట్టు కనిపిస్తాడు. మొత్తంగా మెరిసే చందమామ కాస్త కట్ అవుతూ కనిపిస్తాడు. అయితే మెరిసేదంతా బంగారం కాదు అన్నట్టు.. తాను అంత ప్రకాశవంతంగా వెలగడానికి కూడా చంద్రుడు కారణం కాదు. పౌర్ణమి వేళ లైట్‌లా కనిపించే ఆ కాంతి అసలు చంద్రుడిదే కాదు. సూర్యరశ్మి దానిపైన పడి ఆ కాంతి మన భూమి వైపు రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే అది మనకు మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. అయినా వెన్నల కాంతి మనకు హాయిగానే ఉంటుంది.