పీచు మిఠాయి తింటే క్యాన్సర్ వస్తుందా?
పుదుచ్చేరి, తమిళనాడులలో పీచు మిఠాయిపై నిషేధం విధించబడింది. దీంతో పీచు మిఠాయిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
By అంజి Published on 25 Feb 2024 8:00 AM GMTపీచు మిఠాయి తింటే క్యాన్సర్ వస్తుందా?
పుదుచ్చేరి, తమిళనాడులలో పీచు మిఠాయిపై నిషేధం విధించబడింది. దీంతో పీచు మిఠాయిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. స్కూళ్లు, ఇతర ప్రాంతాల్లో పిల్లలు తినే ఆహార పదార్ధాలు, తిను బండారాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. చాలా ప్రాంతాల్లో కాలం చెల్లిన పీచు మిఠాయిలను అమ్ముతున్నారని అధికారులు చెబుతున్నారు. పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక కెమికల్స్ ఉన్నాయని పరీక్షల్లో తేలింది. దీంతో తమిళనాడు రాష్ట్రంలో వాటి అమ్మకాలను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు ప్రభుత్వం కంటే ముందే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పీచు మిఠాయి అమ్మకాలను నిషేధించారు. పీచు మిఠాయిలో రంగు వచ్చేందుకు రొడామిన్ బి అనే కెమికల్‌ని కలుపుతున్నారని, దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. ఆమె ఈ ప్రకటన చేసిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయిపై నిషేధం విధించింది.
రోడమైన్ బి పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే రంగు. దీన్నే కార్సినోజిన్ అని కూడా అంటారు. దీన్ని పీచు మిఠాయి తయారీలోనే కాదు, జెల్లీలు, క్యాండీలు, చివరకు కారం పొడి ఎర్రగా కనిపించేందుకు అందులో కూడా ఉపయోగిస్తుంటారు. రోడమైన్- బి ఉన్న ఆహార పదార్థాల వల్ల కాలేయం, కిడ్నీ, మూత్రాశయ సమస్యలు, క్యాన్సర్లు రావచ్చని వైద్య నిపుణులు చెబుతుననారు. పీచు మిఠాయి ఎక్కువగా పిల్లలు తింటుంటారు. ఇది తినడం వల్ల వారిలో ఏం జరుగుతుందనేది శాస్త్రీయంగా రుజువు కాలేదు. అయితే దాని ప్రభావం వారి పెరుగుదలపై ఉంటుందని, దీర్ఘకాలంలో దీని ప్రభావం బహిర్గతం కావడం వల్ల అవి క్యాన్సర్లకు దారి తీయొచ్చని ఆయన చెప్పారు.