దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ లక్షలాది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు. వీరిలో చాలా మంది కౌంటర్ల వద్దే టికెట్లు కొనుగోలు చేస్తారు. అయితే ఇలా కౌంటర్ వద్ద టికెట్లు తీసుకున్న ప్రయాణికులు.. ఆన్‌లైన్‌లో తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు.. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ముందుగా ఐఆర్‌సిటీసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. లేదా యాప్‌ను ఓపెన్ చేసి, లాగిన్ అవ్వాలి.
MORE అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ దగ్గర క్లిక్ చేయాలి.
అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో రైల్వే కౌంటర్‌లో తీసుకున్న టికెట్‌కు సంబంధించి పీఎన్‌ఆర్ నంబర్, రైలు నంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా నమోదు చేయాలి.
ఆ తర్వాత చెక్‌బాక్స్ నియమాలను నిర్ధారించుకుని, సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
అప్పుడు బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ నంబర్‌ను నమోదు చేసి మళ్లీ సబ్మిట్ చేయాలి.
సరైన ఓటీపీ ఎంటర్ చేశాక మీ పీఎన్‌ఆర్ వివరాలు స్క్రీన్‌పై కనిస్తాయి.
వివరాలను ధ్రువీకరించుకుని 'టికెట్ రద్దు చేయండి' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ వెంటనే మనకు రావాల్సిన మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది. క్యాన్సిలేషన్ పూర్తవుతుంది.