క్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో లాభాలెన్నో
ఈ రోజుల్లో చాలా మంది పేమెంట్స్ కోసం క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అయితే అలా లావాదేవీలు జరిపే విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
By అంజి Published on 18 Sept 2024 2:07 PM ISTక్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో లాభాలెన్నో
ఈ రోజుల్లో చాలా మంది పేమెంట్స్ కోసం క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అయితే అలా లావాదేవీలు జరిపే విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. క్రెడిట్ కార్డు విషయాల్లో కూడా అనేక మోసాలు జరుగుతున్నాయి. అయితే అలాంటివి జరగకుండా ఉండాలంటే క్రెడిట్ కార్డ్ ప్రొటెక్సన్ ప్లాన్ తీసుకోవాలి. దీన్ని వేర్వేరు బ్యాంకులు అందిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్, మీ క్రెడిట్ కార్డుకు బీమా ప్లాన్ వంటిది.
కార్డు పోయినప్పుడు
ఒక వేళ మీ క్రెడిట్ కార్డు మిస్ అయితే.. కస్టమర్ కేర్‌కి కాల్ చేసి కార్డు బ్లాక్ చేయమంటారు. మరి ఒకటికి మించి క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి? అప్పుడు వారు వేరు వేరు కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేయాల్సి ఉంటుంది. కానీ సీపీపీ ఉంటే ఒక్క సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది. ఒక్క ఫోన్ కాల్‌తో ప్లాన్‌కు లింక్ చేసిన అన్ని కార్డులను బ్లాక్ చేస్తారు.
అత్యవసర సమయంలో
మీరు విదేశాలకు వెళ్లినప్పుడు ఒక వేళ మీ క్రెడిట్ కార్డు పోతే సీపీపీ అత్యవసర నగదు అడ్వాన్స్‌ను అందిస్తుంది. దీంతో హోటల్ బిల్లులు, ప్రయాణి టికెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. 48 గంటల్లో మీకు సహాయం అందుతుంది. స్వదేశంలో అయితే 24 గంటల సమయమే పడుతుంది. ఇలా వచ్చే డబ్బుకు వడ్డీ కూడా ఉండదు. 28 రోజుల్లో ఈ పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.
ఛార్జీలు: రూ.1200తో సీపీపీ వార్షిక ప్రీమియం మొదలవుతుంది. ఇది ప్రొవైడర్‌ను బట్టి మారుతుంది. దీంతో స్విమ్మింగ్, ఫిషింగ్ వంటి మోసపూరిత లావాదేవీల నుంచి బయటపడొచ్చు. అయితే ప్రీమియం ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఎలా?: మీరు ఎంచుకున్న ప్లాన్ కోసం ఓ దరఖాస్తు ఫారంను పూరించి సర్వీస్ ప్రొవైడర్‌కి ఇవ్వాలి. బ్యాంకు రిజిస్టర్డ్ వెబ్‌సైట్‌లో కూడా సీపీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. సీపీపీ జారీ చేసేవారు అన్ని బ్యాంకులతో టై అప్ ఉన్నారా లేదా అని ముందే తెలుసుకోవాలి. రియంబర్స్‌మెంట్ గురించి కూడా తెలుసుకోవాలి.