అంజీర శాకాహారమా? మాంసాహారమా?

అంజీర పండును చాలా మంది ఎంతో ఇష్టంతో తింటారు. మరికొందరు డ్రైఫ్రూట్స్‌ రూపంలో తీసుకుంటారు.

By అంజి  Published on  22 Dec 2024 11:15 AM IST
Anjeera, figs, vegetarian, Non-vegetarian

అంజీర శాకాహారమా? మాంసాహారమా?

అంజీర పండును చాలా మంది ఎంతో ఇష్టంతో తింటారు. మరికొందరు డ్రైఫ్రూట్స్‌ రూపంలో తీసుకుంటారు. అయితే ఇది శాకాహారం కాదనే భావన జనాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే.. అంజీర పువ్వులు పండ్లుగా పరిపక్వం చెందాలంటే ఒక చిన్న తేనెటీగ ద్వారా పరాగ సంపర్కం జరగాలి. ఈ పరాగం సంపర్కం జరిగే క్రమంలో ఆ కీటకం పుష్పంలోకి ప్రవేశించి, అక్కడే గుడ్లు పెడుతుంది. ఈ ప్రక్రియలో, దాని రెక్కలు ఊడిపోతాయి. అది పుష్పం నుంచి బయటకు రాలేదు. కొద్దిసేపటికే అందులోనే చనిపోతుంది. అందుకే అంజీర పండును మాంసాహారం అని భావిస్తారు.

అయితే కందిరీగ శరీరాన్ని పువ్వులో ఉండే ఫిసిన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణం చేసేస్తుంది. అంజీర పుష్పం పండుగా మారేనాటికి కీటకం పూర్తిగా కరిగిపోతుంది. ఈ ప్రాసెస్‌ అంతా మానవసహిత జంతు దోపిడీ కాని సహజ ప్రక్రియ కాబట్టి శాకాహారంగానే భావించాలని కొందరు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. కొందరు కందిరీగల ద్వారా పరాగ సంపర్కం జరగని అంజీరాలను పండిస్తూ, మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటిని పూర్తిగా శాకాహారంగానే పరిగణించవచ్చు.

Next Story