అమెజాన్ అడవుల గురించి భయంకరమైన వాస్తవాలు
అమెజాన్ అడవులు సౌత్ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలేన్నో ఉన్నాయి.
By అంజి
అమెజాన్ అడవుల గురించి భయంకరమైన వాస్తవాలు
అమెజాన్ అడవులు సౌత్ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఇవి 60 శాతం బ్రెజిల్ దేశంలో ఉంది. అమెజాన్ అడవులు.. ప్రపంచంలోనే అతిపెద్ద అడవులు. మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్‌లో 20 శాతం వీటి నుంచే వస్తుంది. అందుకే వీటిని Lungs of the Earth అని పిలుస్తారు. ఈ అడవుల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలేన్నో ఉన్నాయి.
దట్టమైన అడవి - దట్టమైన చెట్ల కారణంగా అడవి అంతా చీకటిగానే ఉంటుంది. సూర్యరశ్మి 2 శాతం భూ భాగంపై మాత్రమే పడుతుంది. ఇక్కడ పడే వర్షం నేల మీద చేరడానికి దాదాపు 10 నిముషాల సమయం అవుతుంది. కాఫీ, చాక్లెట్, రైస్,మిరియాలు, పైన్ ఆపిల్స్ తోపాటు ఇతర ఆహార పదార్థాలు 80% కంటే ఎక్కువ గా ఈ అడవుల నుంచే లభిస్తున్నాయి.
ఆటవిక జాతులు - ఇక్కడ 500 ఆటవిక జాతులు ఉన్నాయి. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. మనుషులను తినేవాళ్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక 390 బిలియన్ చెట్లు 4వేల వృక్ష జాతులు, 2200 చేప జాతులు, 1200 పక్షి జాతులు, 420 ఉభయచరాలు, 370 సరీసృపాలు నివశిస్తున్నాయి. ఎన్నో వింతైన,క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి.
విషపు చేపలు- అనకొండ, జాగ్వర్, ప్యూమా, స్పైడర్ మంకీ, విషపూరితమైన బుల్లెట్ యాంట్స్, విషపు పిరాన్హ చేపలు, ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, పింక్ రివర్ డాల్ఫిన్స్ ఇంకా మనిషి గుర్తించలేని వింత వింత జంతువులకు ఆవాసంగా ఉంది.
వాటర్ లిల్లీ - ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకులు కూడా ఇక్కడే కనిపిస్తాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆకు. 3 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ ఆకు దాదాపు 40 కేజీల బరువు మోయగలదు.
కన్నీళ్లు తాగే తాబేళ్లు - అమెజాన్ పారెస్ట్‌లో నివసించే తాబేళ్లు కన్నీళ్లు తాగి బ్రతుకుతాయి. ప్రపంచంలో అతి బిగ్గర గా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవులలోనే ఉంది. దీని కూత దాదాపు అర మైలు దూరం వరకు వినిపిస్తుంది. ఈ దట్టమైన అడవిలోనే ఇక్విటోస్ అనే మహా నగరం ఇక్కడ సుమారు 4లక్షల మంది నివసిస్తూ ఉంటారు.