జీవితంలో ఎన్నో నేర్పిన 'లాక్‌డౌన్‌'

By సుభాష్  Published on  9 April 2020 3:48 AM GMT
జీవితంలో ఎన్నో నేర్పిన లాక్‌డౌన్‌

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా రోజురోజుకు విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా తమ తమ ఇళ్లల్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే దేశం విపత్కర సమయంలో ఉండటంలో లాక్‌డౌన్‌ విధించింది. అలాంటి లాక్‌డౌన్ మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయనే చెప్పుకోవాలి.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఒక స్వప్నం కాదని, ఇలాంటి కష్టతరమైన సమయంలో ఎంతో అవసరమని నేర్పించింది లాక్‌డౌన్. అంతేకాదు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల కాలుష్యం కూడా ఎంతో తగ్గిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఒక స్వప్నం కాదని, సకంట సమయంలో ఎంతో అవసరమని నేర్పించింది. కార్యాలయానికి వెళ్లకపోయిన ఇంటి నుంచే పని చేసుకోవచ్చని నిరూపించింది లాక్‌డౌన్.

ఇలాంటి విపత్కర సమయంలో వారంలోనే ఆస్పత్రుల నిర్మాణం, భవనాలు, రైలు బోగీలు, స్టేడియంలు, పలు భవనాలు ఆస్పత్రులుగా మారిపోయాయి. మనం తలుచుకుంటే రోజుల వ్యవధిలోనే ఏదైనా సాధించవచ్చని నేర్పింది.

అలాగే ప్రభుత్వాలు తలుచుకుంటే నిమిషాల్లోనే పథకాలు రూపొందించి పేదలకు ఆదుకోవడం లాంటివి సాధ్యమని నిరూపితమైంది. పేదలకు తినడానికి తిండి లేకున్నా అప్పటికప్పుడు ఆహారాన్ని తయారు చేసి పేదలకు అందించడం సాధ్యమనది లాక్‌డౌన్‌ వల్ల నేర్చుకోవచ్చు.

ఇక ఇంకో విషయం ఏంటంటే అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇటలీ వంటి ఆగ్రదేశాలు సైతం సహాయం కోసం ఎదురు చూస్తుండటం. ఇలాంటి అగ్రదేశాల్లో ఎంత డబ్బున్నా.. ఎంత టెక్నాలజీ ఉన్నా కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోలేవని రుజువైంది. అన్ని విధాలుగా పేరుమోసిన ఇలాంటి దేశాలను చూస్తుంటే వెక్కిరించేలా ఉంది. కరోనా వచ్చి ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేక, సరైన మందులు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న దేశాలు లాక్‌డౌన్‌ వల్ల గుణపాఠం నేర్చుకుంటున్నాయి. అంతేకాదు ఎలాంటి కరోనా వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉందని, తమది అతిపెద్ద దేశమని, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశమని ప్రగల్భాలు పలికిన అమెరికా దేశం డొల్లతనం బయటపడింది. కరోనా లాక్‌డౌన్‌తో అతలాకుతలం అవుతోంది.

లాక్‌డౌన్‌ సమయంలో పొదువు విలువ బాగా తెలిసొచ్చింది. కష్టకాలంలో డబ్బులను తెలివిగా ఎలా ఖర్చు పెట్టాలో లాక్‌డౌన్ వల్ల నేర్చుకున్నాము. ఇలాంటి కష్టకాలంలో ఎలా ఎంత పొదుపుగా బతుకుతున్నామో అన్నది చాలా ముఖ్యం.

ప్రతీవారం సినిమాలు చూడకపోయినా, షాపింగ్‌లు చేయకపోయినా రెస్టారెంట్లకు వెళ్లకపోయినా బతకగలమని లాక్‌డౌన్‌ నేర్పింది.

అంతేకాదు కాలంతో పోడిపడి పరుగెడుతున్న సమయంలో ఇంట్లో భార్యాభర్తలను కూర్చోబెట్టి కబుర్లు చెప్పుకునేలా చేసింది లాక్‌డౌన్. వాట్సాప్‌లలో తప్ప నేరుగా కలవకపోయినా కుటుంబ సభ్యులందరినీ సైతం ఒక్క చోట కలిపింది. ఏ క్షణంలో ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొవాలన్న తత్వం లాక్‌డౌన్ నేర్పించింది.

అలాగే కొందరు మద్యం ప్రియులు రోజు వారీగా మద్యం లేకుండా ఉండలేరు. అలాంటిది ఈ సమయంలో మద్యం లేకుండా ఉండగలను అనే ధైర్యం లాక్‌డౌన్‌ కలిగించింది. కొందరికి రోజు బయటకు వెళ్లనిది గడవదు. ఇంట్లో ఉండాలంటే తెగబోర్‌ కొట్టేస్తుంటుంది. అలాంటిది లాక్‌డౌన్‌ సమయం కారణంగా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండగలను అన్న భరోసా కలిగించింది.

సాధారణంగా ప్రభుత్వాలు ఏదైన పనులు చేయాలంటే కొన్ని రోజులు, నెలలు పట్టేది అలాంటిది లాక్‌డౌన్‌ సమయంలో క్షణాల్లోనే పనులు చేసేలా చేసింది.

ఇక మొత్తం మీద బతకడానికి ఒక మార్గం ఉంటుంది.. అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగడమే మన ముందున్న కర్తవ్యం.

Next Story