ఈ దీపావళి.. వారి జీవితాలలో కూడా వెలుగులు నింపుదాం..!

By సత్య ప్రియ  Published on  21 Oct 2019 8:51 AM GMT
ఈ దీపావళి.. వారి జీవితాలలో కూడా వెలుగులు నింపుదాం..!

ఇంకో వారం రోజుల్లో సంబరాల దీపాల పండుగ, దీపావళి వచ్చేస్తోంది.

దీపతోరణాలతో గృహాన్ని అలంకరించి, లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానిస్తూ, బాణాసంచాతో సంబరంగా జరుపుకునే ఐదు రోజుల పండుగ ఇది. ఈరోజున ప్రతి ఇల్లూ దీపపు కాంతులతో వెలిగిపోతుంది. రకరకాల దీపాలు ఇంటి నిండా అలంకరించి పొంగిపోతుంటారు అంతా.

W 71

అయితే, సాంప్రదాయబద్దంగా వాడే మట్టి ప్రమిదలు కాకుండా పర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న దీపాల మీద జనం ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల దీపావళికి ఎన్నో రోజులముందు నుంచి కుమ్మరులు పడే కష్టం వృధా అయిపోతోంది.

Potter3

చౌకగా దొరికే చైనా కరెంట్ దీపాల మీద మోజుతో మట్టి దీపాలను దూరం చేసుకుంటున్నాం మనమందరం. తరతరాలుగా మట్టి దీపాలు తయారు చేసి అమ్మే కుటూంబాలకు సరైన ఆదరణ లేక కష్టపడుతున్నారు.

Ehyghz Vaaacz2q

అయితే, ఈ సారి దేశంలో చైన వస్తువులూ, ప్లాస్టిక్ వస్తువుల మీద పెరుగుతున్న విముఖత వల్ల తమ వ్యాపారం బాగా సాగుతుందని కుమ్మరులు ఆశ పడుతున్నారు. దేశ వ్యాప్తంగా సోషల్ మీడీయా లో మట్టి దీపాలు కొని కుమ్మరుల జీవితాలలో వెలుగులు నింపుదాం అంటూ ప్రచారం సాగుతోంది.

000 1l714e.2baa3083737.original

రండి... మనం కూడా పైపై మెరుగులకు మోస పోకుండా సాంప్రదాయబద్దంగా మట్టి ప్రమిదలతో దీపావలి చేసుకొని, తరాలుగా ఈ వృత్తికే అంకితమైన కళాకారూల జీవతాలలో కూడా వెలుగులు నింపుదాం

#potterskidiwali

Next Story