హైదరాబాద్‌లో చిరుత సంచరిస్తోందా ?

By రాణి  Published on  21 April 2020 3:35 PM IST
హైదరాబాద్‌లో చిరుత సంచరిస్తోందా ?

  • ఆ వీడియో ఎక్కడ రికార్డ్‌ చేశారు ?

కరోనా యావత్‌ ప్రపంచంలోనే కల్లోలం రేపుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే.. జంతువులు మాత్రం బాహాటంగా, స్వేచ్ఛగా రోడ్లమీదకు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ మొదలయినప్పటినుంచీ పలు సందర్భాల్లో వీటికి సంబంధించిన దృశ్యాలు రికార్డవుతూ ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్నచోట జంతువులు స్వేచ్ఛగా సంచరించే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇప్పుడు ఓ చిరుత పులి కూడా అలాగే.. రహదారిమీదకు వచ్చింది. జంకులేకుండా, బెదరకుండా నెమ్మదిగా రోడ్డు దాటింది. అది కూడా డబుల్‌ రోడ్డు కావడంతో.. రోడ్డు ఇటువైపునుంచి వెళ్లి డివైడర్‌ ఎక్కి అటువైపు దూకి.. నెమ్మదిగా చెట్లపొదల్లోకి జారుకుంది.

Also Read :రణ్ వీర్, రానా, శర్వానంద్, త్రివిక్రమ్ లకు చెర్రీ ఛాలెంజ్

సోషల్‌ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. లాక్‌డౌన్‌ సమయంలో రోడ్డుమీద రద్దీ లేకపోవడంతో క్రూర మృగాలు కూడా రోడ్లమీద యధేచ్ఛగా సంచరిస్తున్నాయంటూ సోషల్‌ మీడియా ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్‌లో ఈ వీడియో రికార్డయ్యిందని పోస్టులు పెడుతున్నారు.

ఈ దృశ్యాలు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కెమెరాకు చిక్కాయని పలు వాట్సప్‌ గ్రూపుల్లో వీడియో హల్‌చల్‌ చేస్తోంది. అది కూడా బసవతారకం ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌కు వెళ్లే దారిలో ఈ చిరుత కనిపించిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో.. హైదరాబాద్‌ నడిబొడ్డున ఈ చిరుత తిరుగుతోందేమో అని జనం భయపడిపోతున్నారు.

Also Read : జన్‌ధన్‌ ఖాతాల్లోకి రూ. 7,500

కానీ, ఈ వీడియోను పరిశీలిస్తే... ఇది హైదరాబాద్‌లో రికార్డ్‌ చేసిన వీడియో కాదు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌కు సంబంధించినది అంతకన్నా కాదు. ఈ వీడియో తిరుమల ఘాట్‌రోడ్డులో రికార్డు చేశారు. ఈనెల 18వ తేదీన ఈ వీడియో రికార్డయ్యింది. తెల్లవారు జామున మూడు గంటల 11 నిమిషాలకు ఈ వీడియో రికార్డ్‌ అయ్యింది.



ప్రచారం : హైదరాబాద్‌లో చిరుతపులి సంచరిస్తోంది.

వాస్తవం : ఈ వీడియో ఈనెల 18వ తేదీన తిరుమల ఘాట్‌రోడ్డులో రికార్డ్‌ చేశారు.

కంక్లూజన్‌ : హైదరాబాద్‌ వాసులు భయపడాల్సిన అవసరం లేదు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిసరాల్లో చిరుత తిరుగుతోందన్న విషయంలో వాస్తవం లేదు.

- సుజాత గోపగోని

Next Story