రణ్ వీర్, రానా, శర్వానంద్, త్రివిక్రమ్ లకు చెర్రీ ఛాలెంజ్

By రాణి  Published on  21 April 2020 8:49 AM GMT
రణ్ వీర్, రానా, శర్వానంద్, త్రివిక్రమ్ లకు చెర్రీ ఛాలెంజ్

ఆర్ఆర్ఆర్ దర్శకధీరుడు రాజమౌళి తన హీరోలైన తారక్, రామ్ చరణ్ లకు బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. నా పూర్తయింది ఇక తారక్, చరణ్ లే చేయాలంటూ జక్కన్న ఇద్దరికీ ఇంటిపనుల టాస్క్ అప్పజెప్పారు. టాస్క్ ఇచ్చిన 24 గంటల్లోపే చెర్రీ ఇంటి పనులన్నింటినీ చక్కబెట్టేశాడు. బట్టలు ఉతికి, ఇల్లు తుడిచి, మొక్కలకు నీరు పోసి, భార్య ఉపాసనకు కాఫీ కూడా ఇచ్చాడు. ఈ మేరకు ట్వీట్ చేసిన రామ్ చరణ్ ఇంటి పనుల్లో ఆడవాళ్లకు సహాయం చేసి నిజమైన మగాళ్లు అనిపించుకుందాం అనిపేర్కొన్నారు.

Also Read : ప‌నుల‌ను పంచుకుందాం అంటూనే.. ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్‌

అనంతరం రణ్ వీర్, రానా, శర్వానంద్ లను నామినేట్ చేసి..ఇంటి పనులు చేయాలని ఛాలెంజ్ చేశారు. బీ ది రియల్ మ్యాన్ అనే ఛాలెంజ్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ నుంచి మొదలైంది. సందీప్ రాజమౌళిని నామినేట్ చేయగా..ఆయన ఎన్టీఆర్, చెర్రీలను నామినేట్ చేశారు. తారక్ ఇంటి పనులను చేసి ఒకప్పుడు చిత్రపరిశ్రమను ఏలిన హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో పాటు కొరటాల శివను నామినేట్ చేశారు. కాగా..కొరటాల శివ నెలరోజులుగా నేను చేస్తున్న ఇంటి పనుల వీడియో మిస్ అయింది తారక్ అన్నయ్య ..అయినా మళ్లీ చేస్తానంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతమైతే తారక్, చెర్రీలు చేసిన ఇంటి పనుల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.Next Story
Share it