• చెట్టుతొర్రలో దొరికిన పులిపిల్లలు

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేట మండలానికి చెందిన కొందరు స్థానికులు ఇసుక కోసం దగ్గర్లో ఉన్న భవానీపేట అడవికి కాలినడకన వెళ్లారు. అలా వారు ఏదో మాట్లాడుకుంటా ఆడుతూ, పాడుతూ అడవికి చేరుకున్నారు. అలా వెళ్తుండగా..వారికొక చెట్టు తొర్రలో రెండు చిరుతపులి పిల్లలు కనిపించాయి. మొదట అవి పిల్లి పిల్లలు అనుకున్నారు..తీరా దగ్గరకెళ్లి చూస్తే అవి పులిపిల్లలు. ఇంకేముంది..వామ్మో అని అరుస్తూ..పరుగులంకించారు. కాస్త దూరంగా వెళ్లి..ఆ పులి పిల్లలు ఏం చేస్తున్నాయా అని వెనక్కి చూశారు. అవి ఆ చెట్టు తొర్రలో నుంచి బయటికొచ్చి అటూ ఇటూ చూస్తూ..తమ తల్లిని వెతుక్కుంటునట్లు అనిపించింది. ఆ పులిపిల్లల తల్లి అక్కడ లేదని గ్రహించిన వారిలో ఓ కుర్రాడు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వాళ్లు అటవీశాఖాధికారులకు ఫోన్ చేయగా..అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వాటికి ఎలాంటి హానీ జరుగకుండా జాగ్రత్తగా సేకరించారు.

Also Read :
కాళ్లు, చేతులు మంచానికి క‌ట్టేసి.. ప‌చ్చిమిర్చి ముద్ద‌ల‌ను ఒక్కొక్క‌టిగా..

ఇంకెప్పుడూ “ఇసుక, పుల్లలు అంటూ ఇక అడవిలోకి వెళ్లకండి. వీటి తల్లి వీటి కోసం వస్తుంది. ఇవి లేవని తెలిస్తే ఊరుకోదు” అని స్థానికులకు సూచించారు. తర్వాత పులి పిల్లల్ని జూ కి తరలించారు. అలాగే వాటి తల్లికోసం ఓ బోను ఏర్పాటు చేసి..అక్కడే సీసీ కెమెరాలను అమర్చారు. ఆ తల్లి చెట్టు తొర్ర దగ్గరకు రాగానే.. బోనులో బంధీ అవుతుందనీ, అందువల్ల ఎలాంటి టెన్షనూ అక్కర్లేదని అంటున్నారు. కానీ..ఆ పిల్లలు రెండ్రోజుల కిందటే పుట్టి ఉంటాయని..వాటి కోసం వచ్చిన తల్లి..తమ ఊర్లపై పగబట్టే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. మొత్తానికి చిరుత పులులు అంతరించిపోతున్నాయనుకుంటున్న తరుణంలో..రెండు చిరుత పిల్లలు దొరకడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.