బిచ్చగత్తె బ్యాంకు అకౌంట్లో కోట్ల రూపాయలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 7:34 PM IST
బిచ్చగత్తె బ్యాంకు అకౌంట్లో కోట్ల రూపాయలు

ఏళ్ల తరబడిగా బిచ్చం ఎత్తుకుంటోంది ఆ మహిళ. వచ్చిన సొమ్మును బ్యాంక్ లో దాచిపెడుతూ వచ్చింది. అయితే, బ్యాంకు అకౌంట్‌లో జమా అయిన సొమ్మును చూసి బ్యాంకు అధికారులతో పాటు జ‌నాలు నోరెళ్లబెట్టేలా చేసింది.

ఈ ఉదంతం లెబనన్ లో చోటు చేసుకుంది, లెబనాన్‌లోని సైదా నగరంలో బిచ్చం ఎత్తుకునే వఫా మొహమ్మద్ అవద్ వచ్చిన సొమ్మును జమాల్ ట్రస్ట్ బ్యాంకులో దాచిపెట్టింది. తాజాగా ఆమె ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నందున తన పొదుపు చేసిన సొమ్మును మరొక బ్యాంకుకు బదిలీ చేయడానికి బ్యాంకుకు వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో చెక్‌కు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో అది కాస్తా అంతర్జాలంలో వైరల్‌గా మారింది. ఆ చెక్ విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ. 6 కోట్ల 38 లక్షలు.

రోజూ తమ వద్ద బిచ్చం ఎత్తుకొని పొట్ట నింపుకునే ఆమె వద్ద భారీ మొత్తంలో నగదు ఉండడం అక్కడి జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇక ఆమెను దగ్గర నుంచి చూసిన వారికైతే నోటమాట రావడం లేదట.

ఇన్నాళ్లు దాతృత్వం పేరిట ఆమెకు డబ్బు ఇచ్చిన చాలా మంది ప్రజల కంటే ఇప్పుడు వఫా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి.. ఇది తెలిసిన అక్కడి వారు అవాక్కవుతున్నారు.

Next Story