నేడు ఇందిరా గాంధీ వర్థంతి.. నేతల నివాళులు
By సత్య ప్రియ Published on 31 Oct 2019 5:48 AM GMTదివంగత ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా, ఈ రోజు పలువురు నేతలు ఆమెకు నివాళులర్పించారు. ప్రధాని మోదీ ఇవాళ ట్విటర్లో స్పందిస్తూ... ‘‘భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆమెకు వినయపూర్వక నివాళులు...’’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు.
ఢిల్లీలో ఇందిరాగాంధీ హత్యకు గురైన శక్తిస్థల్ దగ్గర మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా తో పాటు, కాంగ్రెస్ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారత దేశపుమొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. భారతదేశ ప్రప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. నవంబర్ 19, 1917న అలహాబాదులో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినది. తల్లి కమలామనెహ్రూ,తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. ఈమెకి ప్రియదర్శని అని నామాంతరం కలదు. బాల చరఖా సంఘాన్ని స్థాపించింది.
26 మార్చ్, 1942 న ఫిరోజ్ గాంధీ ని వివాహం చేసుకొని ఇందిరాగాంధీగా మారింది. 1955లో కాంగ్రెసులో చేరింది.1955లోనే అఖిలభారత కాంగ్రెసుకి అధ్యక్షరాలుగా ఎన్నికైంది. ప్రధాని లాల్ బహుదూర్ మరణంతో ఆ స్థానానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఎన్నికైంది. 1966 లో భారతప్రధానిగా ఎన్నికై అతిచిన్నవయసులో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.
1971లో 19 బ్యాంకులను జాతీయం చేసింది. 1971 ఎన్నికల్లో గెలిపొంది, 3వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది. గరీబీ హటావో అనే నినాదంతో దేశప్రజలని ఉత్తేజపరిచింది. 1971లో పాకిస్తానుతో యుద్ధం జరగగా, ఓడించింది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు చేయబడింది. ఈమె హయంలో రాజస్థానలోని ఫోఖ్రాన్ వద్ద భూగర్బ అణుపేలుడు ప్రయోగం జరిపింది.
1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించడంలో ఆమె కీలక పాత్ర వహించింది. 1980 లో 4వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది. సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలాపై దాడికోసం స్వర్ణదేవాలయంలోకి సైన్యాన్ని పంపించగా, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు. ఈ దాడియే ఆపరేషన్ బ్లూస్టార్ గా ప్రసిద్ధిగాంచినది.
ఈ దాడి వల్ల ఆగ్రహించిన సిక్కులు, అంగరక్షకులుగా నటీంచి ఆమె ను 1984 అక్టోబర్ 31 న హతమార్చారు. ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు.
1953లో ఈమె సేవలకు అమెరికా వారిచే మదర్స్ అవార్డ్, 1960లో ఏల్ యూనివర్షిటీ వారిచే హాలెండ్ మెమొరియల్ అవార్డ్, 1965లో ఇటాలియన్ ఇసబెల్లా డిఎస్టె అవార్డులు వరించాయి. 1971 లో భారత ప్రభుత్వపు అత్యున్నత అవార్డుభారత రత్నను స్వీకరించి ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించింది. 1983-84 లో రష్యా దేశపు లెనిన్ శాంతి బహుమతి లభించింది.
ఇందిరా గాంధీకి ఇద్దరు కుమారులు - రాజీవ్ గాంధీ(1944 - 1991), సంజయ్ గాంధీ (1946 - 1980). రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ పార్టీ ఆద్యక్ష పదవిలో ఉంటూ 2004 లోక్‌సభ ఎన్నికలలో యూ.పి.ఏ. కూటమి తో కల్సి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, కుమారై ప్రియాంక లు కూడా రాజకీయాలలో ప్రవేశించారు.