'ల‌క్ష్మిబాంబ్’ టైటిల్ మారింది

By సుభాష్  Published on  30 Oct 2020 12:05 PM IST
ల‌క్ష్మిబాంబ్’ టైటిల్ మారింది

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్‌’. రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా.. నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయనున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలలో అదే రోజు వెండితెరపై విడుదలవుతోంది.

కాంచన సినిమాకు ఇది హిందీ రీమేక్‌. కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్, తుషార్‌ ఎంటర్‌టైన్‌ హౌజ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే విడుద‌ల‌కు ముందే భారీ మార్పు చేసింది చిత్ర‌యూనిట్. ల‌క్ష్మిబాంబ్ టైటిల్ నుంచి బాంబ్ పేరును తొల‌గించి.. టైటిల్ ను ‘ల‌క్ష్మి’గా మార్చారు మేక‌ర్స్. హిందీలో డైరెక్ట‌ర్ గా రాఘ‌వాలారెన్స్ కు ఇది తొలిచిత్రం. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీక‌రించిన వీడియో సాంగ్ కు అద్బుత‌మైన స్పంద‌న వస్తోంది.

Next Story