రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన జీవిత‌

By సుభాష్  Published on  30 Oct 2020 5:51 AM GMT
రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన జీవిత‌

టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో రాజ‌శేఖర్ కొద్ది రోజుల క్రితం కరోనాతో హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో సెంట‌ర్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంది..? ఈ ప్ర‌శ్న‌కు ఇంత‌కుముందు ఆస్ప‌త్రి వ‌ర్గాలు స‌మాధానం ఇచ్చాయి. ప్లాస్మా థెర‌పీతో చిక‌త్స‌కు స్పందించార‌ని వెల్ల‌డించారు. ఇక తాజాగా ఆయ‌న స‌తీమ‌ణి జీవిత.. రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యంపై స్పందించారు.

80శాతం రికవరీ అయ్యారని తెలిపారు. కోవిడ్ 19 ప్రభావం తగ్గిందని వెల్లడించారు. 'గత మూడు రోజుల నుండి ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడింది. అన్ని ఇన్ఫెక్షన్లు ఇప్పుడు తగ్గాయి. బాగా కోలుకున్నారు. నేను ప్రస్తుతం వైద్యులతో టచ్ లో ఉన్నాను. రాబోయే రెండు రోజుల్లో ఐసియు నుంచి జనరల్ వార్డుకి తరలించనున్నారు. అతన్ని ఐసియు నుండి తరలించే ముందు మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. చికిత్స విషయంలో మేం చాలా సానుకూలంగా ఉన్నాం. రాజశేఖర్ మా అందరితో మాట్లాడుతున్నారు' అని జీవిత తెలిపారు. నేను నా కుమార్తెలు కరోనావైరస్ నుండి పూర్తిగా కోలుకున్నామని వెల్లడించారు.

Next Story