చంద్రబాబు అవినీతిపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాస్తా: లక్ష్మీ పార్వతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2019 3:14 PM IST
చంద్రబాబు అవినీతిపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాస్తా: లక్ష్మీ పార్వతి

తాడేపల్లి: తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మీ పార్వతి విలేకరుల సమావేశం నిర్వహించారు ,ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాజకీయాలకు పట్టిన చీడపురుగు చంద్రబాబు అని, ఐదేళ్లు రాష్ట్రం మీద పడి విచ్చలవిడిగా దోచుకున్నాడన్నారు. . తండ్రీకొడుకులిద్దరూ రహస్యంగా జీవోలు విడుదల చేసి రూ.లక్షల కోట్లు దోచుకొని విదేశీ పర్యటనల పేరుతో వాటిని తరలించారన్నారు. రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోయిందని, ప్రజా పాలన అనే పదానికి నిర్వచనం చెబుతూ సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలిస్తున్నాడని లక్ష్మీ పార్వతి చెప్పారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబుపై విచారణ చేయాలని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌లకు లేఖ రాస్తానన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు లక్ష్మీపార్వతి సవాలు విసిరారు. దు నెలల్లో ఇంత పారదర్శకపాలన దేశంలో ఎక్కడ జరిగిందో చూపించాలన్నారు.

అయితే పవన్ దోపిడీ దొంగల పక్కన చేరి నీతులు చెప్పడం కాదని.. నాయకుడిగా ఎలా ఎదగాలో సీఎం వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకోవాలని లక్ష్మీపార్వతి సూచించారు.పవన్, చంద్రబాబు మాయలో ఉన్నారన్నారు. నీవు విషవృక్షం కింద నిలబడ్డావు. నీవు ఎప్పటికీ ఎదగలేవని అన్నారు. రాష్ట్రంలో నదులు నిండుగా పారుతున్నాయి. ఎవరు నిజమైన నాయకుడో ప్రకృతి చెప్పిందన్నారు. కానీ..ఇలాంటి పరిస్దితిలో ఇసుక తీయడం సాధ్యమేనా.? ఇసుక మా వాళ్లు దోపిడీ చేస్తున్నారా ..? ఒక్కళ్లని పట్టివ్వు నీవు చేప్పేది నిజమో కాదో తేలుద్దీ. అని ఆమె సవాల్‌ విసిరారు.

Next Story