ఏపీలో 'ఆప్‌కాస్' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Nov 2019 2:16 PM ISTసీఎం జగన్ ఏపీలో ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఏపీ 'ఆప్‌కాస్' అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే.. సీఎం ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, రాష్ట్రస్థాయిలోని సెక్రటేరియట్‌లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. ఈ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు సీఎం తెలిపారు.
అయితే జనవరి 1 నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్లేస్‌మెంట్ ఆర్డర్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి కోడ్ నెంబర్ ఉంటుందని, ప్రతి కాంట్రాక్టును ఒక ఎంటీటీగా తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ కార్పొరేషన్ పరిధిలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. జిల్లాస్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని ఆదేశించారు. సకాలంలో జీతాలు వచ్చేలా చూసేందుకు ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే డిసెంబర్ 15 వరకు ఉద్యోగాల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.