ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

By అంజి  Published on  2 March 2020 7:39 AM GMT
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ముఖ్యాంశాలు

  • మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఐదుగురు మృతి, మరికొందరికి గాయాలు
  • క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలింపు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పూణె- ముంబై హైవేపై ఓ ట్రక్కు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రక్కు మూడు బైక్‌లపైకి దూసుకెళ్లింది. రాయ్‌గడ్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరి కొంత మందికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారికి వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ట్రక్కు అతి వేగమే ఈ ప్రమాదానికి గల కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అదుపు తప్పి బోల్తా కొట్టిన ట్రక్కు తుక్కు తుక్కు అయ్యింది. ఘటన జరిగిన ట్రక్కు అక్కడి నుంచి పరారు అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.Next Story
Share it