మహిళ కండక్టర్లను అరెస్టు చేసిన కంచన్‌ బాగ్ పోలీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 10:02 AM GMT
మహిళ కండక్టర్లను అరెస్టు చేసిన కంచన్‌ బాగ్ పోలీసులు

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్‌లో మహిళా కండక్టర్లు కూడా పాల్గొన్నారు. మిదాని డిపోకి చెందిన 11 మంది మహిళ కండక్టర్ లను కంచన్ బాగ్ పోలీసులు అరెస్టు చేశారు. మహిళా కండక్టర్లను మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శుభవాని అనే మహిళ కండక్టర్ మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో షుగర్ ఎక్కువై పడిపోయింది.

తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని మహిళా కండక్టర్లు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రరూపం దాలుస్తుందనిహెచ్చరించారు.తెలంగాణ అంతటా బంద్ విజయవంతంగా కొనసాగిందని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

బోసిపోయిన ఎంజీబీఎస్

ఆసియా ఖండంలోనే అతి పెద్ద బస్ స్టేషన్ ఎంజీబీఎస్‌. ప్రతి రోజు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన 3వేల బస్సులు తిరుగుతుంటాయి. అయితే..బంద్‌ ప్రభావంతో ప్రయాణికులు లేక ఎంజీబీఎస్‌ బోసిపోయింది. అయితే.. బస్ స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు మాత్రంబస్సులు లేక ఇబ్బంది పడ్డారు.

Next Story
Share it