నేరేడుచర్లలో కేవీపీని.. ఉత్తమ్‌ను అడ్డుకున్న పోలీసులు
By అంజి Published on 27 Jan 2020 6:24 AM GMTసూర్యాపేట: ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచందర్‌రావు అనుమతి లభించింది. నేరేడుచర్లలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఓటు వేయడానికి వచ్చిన ఉత్తమ్, కేవీపీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఉత్తమ్ అన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తే అడ్డుకుంటున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ఈసీ ఆదేశంతోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చామన్నారు. కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉందని, చైర్మన్ ఎన్నిక గౌరవంగా నిర్వహించాలని ఉత్తమ్ అన్నారు.
తెలంగాణ ఎంపీగా తనకు గుర్తింపు ఉందని కేవీపీ అన్నారు. ఎంపీగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చాన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకుంటానని కేవీపీ అన్నారు.
కేవీపీ ఓటు వేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కాగా అంతకుముందు రిటర్నింగ్ అధికారి ఆదేశాలను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఎట్టకేలకు కాంగ్రెస్ తన పట్టు నెగ్గించుకుంది. టీఆర్‌ఎస్ ఎత్తులను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్తు చేశారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎన్నికల ఫలితాల నుంచి ఉత్కంఠ రేపింది.
నేరేడుచర్లలోని 15 వార్డులకు గాను కాంగ్రెస్ కూటమి 8, టీఆర్‌ఎస్ 7 వార్డులు గెలిచాయి. అయితే కాంగ్రెస్ సృష్టమైనా మెజార్టీ ఉన్నా.. చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని టీఆర్‌ఎస్ ప్లాన్ వేసింది. టీఆర్‌ఎస్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీ బండగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే శానంపూడిసైదిరెడ్డి, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు ఉన్నారు. కాంగ్రెస్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీ ఉత్తమ్, ఎంపీ కేవీపీ రామచంద్రావులు ఉన్నారు. దీంతో ఇద్దరి బలాలు సమానం కానున్నాయి. కేవీపీకి అనుమతి ఇవ్వడంపై ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు. అక్కడున్న మైక్‌ను విరగ్గొట్టి, పేపర్లు చింపేశారు.