అవును ఈ అబ్బాయి.. ఇప్పటి మన మంత్రి గారే.!
By అంజి Published on 9 Feb 2020 11:18 AM GMT
హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్‌గా ఉంటారు. రాజకీయాల్లో ఇప్పటికే కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ ఏర్పరుచకున్నారు. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువస్తూ.. కేటీఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. సోషల్ మీడియా వేదికగా తమ సమస్యలు చెప్పుకుంటున్న వారికి కాదనకుంటా సాయం చేస్తారు. వెంటనే వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తారు. అలానే తనకు సంబంధించిన అనేక విషయాలను కూడా మంత్రి కేటీఆర్ తన అభిమానుల పంచుకుంటూ ఉంటారు.
ప్రస్తుత అంశాలపై స్పందిస్తూ ట్విట్టర్‌లో కేటీఆర్ మాంచి యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు తన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా కేటీఆర్ ట్విట్టర్‌లో తమ మొదటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పెట్టారు. 1998లో తనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ఱభుత్వం రవాణా విభాగం జారీ చేసిన తొలి ఇంటర్నేషన్ లైసెన్స్ దొరికింది.. చూడండి అంటూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. లైసెన్స్‌లో కేటీఆర్ తన యంగ్ ఏజ్‌లో ఉన్న పాస్ ఫొటో ఉంది. లైసెన్స్‌లో కేటీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల తారక రామారావు అని ఉంది. తండ్రి పేరు కే.చంద్రశేఖర్ రావు అని ఉండగా.. పుట్టినతేదీ, జన్మస్థలం పేర్లు కూడా ఉన్నాయి. 1976 జూలై 24న కేటీఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. మంత్రి కేటీఆర్ సిద్ధిపేట జిల్లాలో జన్మించారు.
కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫొటోలను నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. హెయిర్ చాలా బాగుందని, సినిమా హీరో అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్నారేమో అంటూ స్పందిస్తున్నారు.