15 మంది కార్పొరేటర్లకు కేటీఆర్ వార్నింగ్
By సుభాష్ Published on 29 Sep 2020 9:54 AM GMTగ్రేటర్ హైదరాబాద్ కార్పొరేట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నవంబర్ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం నగర ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో సమావేశమైన మంత్రి కేటీఆర్ 15 మంది కార్పొరేటర్లకు వార్నింగ్ ఇచ్చారు.
గ్రేటర్‌లో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగా లేదని సర్వేలో తేలిందని, ఇప్పటికైనా ఆ కార్పొరేటర్లు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కార్పొరేటర్లకు సమస్యలుంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని అన్నారు. అవసరమైతే గ్రేటర్ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రతి రోజు గ్రేటర్‌లో ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతున్నారు. పలువురు కార్పొరేటర్లపై గ్రేటర్‌తో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారి పనితీరు మార్చుకుంటే బాగుంటుందని క్లాస్ తీసుకున్నారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.