పారిశుద్ధ్య కార్మికురాలికి కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
By రాణి Published on 28 April 2020 3:41 PM GMTకరోనా వైరస్ కారణంగా అన్ని రకాల పరిశ్రమలు మూతపడటంతో చాలా వరకూ ప్రజలు ఉపాధి కోల్పోయారు. దీంతో పేదలకు సహాయందించాలన్న సంకల్పంతో టాలీవుడ్ ప్రముఖులతో పాటు వివిధ పారిశ్రామిక వేత్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందించారు. అలాగే ప్రభుత్వం కూడా తెల్లరేషన్ కార్డు దారులందరికీ రూ.1500తో పాటు రేషన్ సరుకులు ఉచితంగా పంపిణీ చేసింది. కరోనా ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో రెండో నెల కూడా ఇదే విధంగా పేదలకు సహాయం అందించనున్నట్లు తెలిపింది ప్రభుత్వం.
Also Read : అమెరికాలో తల్లిదండ్రులు..హైదరాబాద్ లో పాప..
ఇప్పటి వరకూ సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, చిన్నారులు రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలివ్వడం చూశాం. కానీ ఓ పారిశుద్ధ్య కార్మికురాలు తన దాతృత్వాన్ని చాటుతూ మంత్రి కేటీఆర్ కు రూ.10,000 చెక్కును అందించింది. నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోన్న అలివేలుకు నెలకు వచ్చే జీతం రూ.12,000. వాటిలో నుంచే రూ.10,000 ను కేటీఆర్ కు ఇచ్చి పేదలకు సహాయం చేయాలని కోరింది. ఆమె సంకల్పానికి ఫిదా అయిన కేసీఆర్ అభినందనలు తెలిపారు.
Also Read :నెటిజన్లకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చిన గోరంట్ల, విజయసాయి..