నారాయణగూడ పీఎస్ పరిధిలో గల బర్కత్ పురాలో తాతయ్య – నానమ్మ ల వద్దే ఉంటోంది పాప మైరా. తల్లిదండ్రులు అమెరికాలోని బోస్టన్ లో ఉండిపోయారు. కరోనా కారణంగా వారిక్కడికొచ్చి పాపను తమతో తీసుకెళ్దామంటే వీలుకాని పరిస్థితి. ఇంతలోనే పాప మొదటి పుట్టినరోజు వచ్చేసింది. ఎంతో ఘనంగా చేయాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. తమ పాప మైరా మొదటి పుట్టినరోజు వేడుకలను జరిపించాల్సిందిగా హైదరాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Also Read : నెటిజన్లకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చిన గోరంట్ల, విజయసాయి..

తల్లిదండ్రుల కోరిక మేరకు పోలీసులు పాప ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి జన్మదిన వేడుకలు జరిపించారు. కేక్ కట్ చేయించి, పాపకు బహుమతిగా ఓ తెడ్డీబేర్ ఇచ్చారు. ఈ వేడుకల్లో నగర సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు. పాప మైరాకు మొదటి సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

నాలుగురోజుల క్రితం మల్కాజ్ గిరి పీఎస్ పరిధిలో కూడా ఓ పెద్దావిడ 60వ జన్మదిన వేడుకలను కూడా పోలీసులే నిర్వహించారు. కొడుకుతో పాటు ఇతర కుటుంబ సభ్యులంతా అమెరికాలోనే ఉండిపోవడంతో కొడుకు విజ్ఞప్తి మేరకు పోలీసులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

Also Read : రాష్ట్రంలో ఉంటే వైసిపి ఉండాలి.. లేదంటే టిడిపి ఉండాలి : విజయసాయి

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort