క్రిష్ కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది...!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 1:53 PM GMT
క్రిష్ కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది...!!

క్రిష్ కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది అన‌గానే... డైరెక్ట‌ర్ గా అనుకుంటే పొర‌పాటే. ఓ వైపు పెద్ద సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే.. మ‌రో వైపు చిన్న సినిమాల‌ను నిర్మిస్తుంటాడు. రాజీవ్ రెడ్డితో క‌లిసి సినిమాలు నిర్మిస్తుంటాడు క్రిష్. అయితే.. సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం అంత‌రిక్షం. ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో నిర్మాణానికి కొంత గ్యాప్ ఇచ్చారు.

ఇప్పుడు అవ‌స‌రాల శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోగా ముందు సంపూర్ణేష్ బాబుని అనుకున్నారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. సంపూ ప్లేస్ లో అవ‌స‌రాల శ్రీనివాస్ వ‌చ్చాడు. రాజీవ్ రెడ్డి, క్రిష్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజు కూడా భాగ‌స్వామి కావ‌డం విశేషం. అయితే... ఈ చిత్రాన్ని సాగ‌ర్ అనే కొత్త‌ దర్శకుడు తెర‌కెక్కిస్తున్నారు.

Next Story
Share it