ఆ హీరో చెల్లెలి విరహ వేదన.. బాయ్ ఫ్రెండ్ దూరంగా ఉండడంతో..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2020 2:35 PM GMT
ఆ హీరో చెల్లెలి విరహ వేదన.. బాయ్ ఫ్రెండ్ దూరంగా ఉండడంతో..!

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తెలుసు కదా.. అదేనండీ సౌత్ రీమేక్స్ కు కొన్ని యాక్షన్ సీన్స్ యాడ్ చేసి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడే.. ఆ హీరో. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన టైగర్ ష్రాఫ్ ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతూ ఉన్నాడు.

ఇక ఈ హీరో చెల్లెలు కూడా బాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ఫేమస్. కృష్ణ ష్రాఫ్ ను ఫిట్నెస్ ఫ్రీక్ అంటారు. ఒకప్పుడు ఎంతో చబ్బీగా ఉన్న ఈ భామ.. ఫిట్నెస్ మీద బాగా దృష్టి పెట్టి మంచి ఫిజిక్ ను సొంతం చేసుకుంది. ఇక అంతే తన సోషల్ మీడియా అకౌంట్ లలో తన బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ సెగలు రేపుతూ ఉంటోంది.

తన రిలేషన్ షిప్ గురించి కూడా ఈ భామ ఏమీ దాచుకోదు..! తన బాయ్ ఫ్రెండ్ ఎబాన్ హయామ్స్ కు దూరమైన కృష్ణ ష్రాఫ్ అతడితో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో ముద్దు పెట్టుకున్న ఫోటోలు, తమ టెర్రస్ మీద ఉన్న ఫోటోలు, ఇద్దరూ కలిసి వర్క్ అవుట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కిషు(అమ్మడి ముద్దు పేరు) లాక్ డౌన్ కారణంగా ముంబై లో ఉండిపోగా ఆమె ప్రియుడు సిడ్నీలో ఉండిపోయాడట. అమ్మడు విరహ వేదన అనుభవిస్తూ ఉందేమో.. ప్రియుడిని గుర్తు చేసుకుంటూ ఫోటోలను పోస్టు చేసింది.

తాజాగా మరోసారి బికీనీలో ఉన్న ఫోటోలను పోస్టు చేసింది కిషు..! బ్లాక్ బికినీ పైన తెలుపు రంగు షర్టును వేసి.. కవ్వించే ప్రోగ్రామ్ ను పెట్టుకుంది. ఇంట్లోనే ఉండండి అంటూ మెసేజీలు కూడా ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Next Story