ఎన్టీఆర్‌ కేబినెట్‌ మంత్రి కొమ్మారెడ్డి కన్నుమూత

By అంజి  Published on  2 Feb 2020 10:28 AM GMT
ఎన్టీఆర్‌ కేబినెట్‌ మంత్రి కొమ్మారెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ నాయకుడు కొమ్మారెడ్డి సురేందర్‌ రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా దీర్ఘకాలిక వ్యాధితో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. ఇవాళ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా మాదాపూర్‌లో తన కుమార్తె నివాసంలో ఉంటున్నారు. మేడ్చల్‌కు చెందిన కొమ్మారెడ్డి అప్పట్లో ఎన్టీఆర్‌ కేబినెట్‌లోమంత్రిగా పని చేశారు. మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన కొమ్మారెడ్డి.. అటవీశాఖ మంత్రిగా పని చేశారు. కొమ్మారెడ్డి మృతి చెందాడని విషయం తెలుసుకున్న విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇండియాకు ప్రయాణమయ్యారు. ఆయన అంతిమ సంస్కారాలు రేపు ఉదయం జరగనున్నాయి. కొమ్మారెడ్డి మృతి పట్ల టీడీపీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

1

కొమ్మారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొమ్మారెడ్డి అంతిమ సంస్కారాలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను చూడాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సూచించారు. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు కూడా కొమ్మారెడ్డి కూడా సంతాపం తెలిపారు.

2 3 4 5

Next Story
Share it