కోహ్లీ సూప‌ర్ మ్యాన్ క్యాచ్.. అదుర్స్..

By Newsmeter.Network  Published on  26 Jan 2020 10:59 AM GMT
కోహ్లీ సూప‌ర్ మ్యాన్ క్యాచ్.. అదుర్స్..

ప్ర‌పంచ క్రికెట్ ల్లో అత్యుత్త‌మ క్రీడాకారుల్లో విరాట్ కోహ్లి ఒక‌డు. అద్భుత‌మైన ఫిట్‌నెస్ తో పాటు వికెట్ల మ‌ధ్య చురుకుగా ప‌రుగెత్త‌డంలో త‌న‌కు తానే సాటి. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లోనూ సూపర్ మ్యాన్ తరహాలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఆ షాట్‌ కొట్టిన కివీస్ బ్యాట్స్‌మెన్ నోరెళ్ల పెట్టి నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. సోషల్ మీడియాలో కోహ్లీ క్యాచ్ వైరలైంది.

ఆక్లాండ్ లో రెండో టీ20లో విరాట్ ఈ అద్భుత‌మైన క్యాచ్ ను అందుకున్నాడు. శివ‌మ్ దూబే బౌలింగ్ లో కొలిన్ మ‌న్రో ఎక్స్ ట్రా క‌వ‌ర్స్ దిశగా బంతిని బౌండ‌రీకి పంపాల‌నుకున్నాడు. బ్యాట్‌ను తాకి నేరుగా గాల్లోకి బంతి లేచింది. మెరుపు వేగంలో ముందుకొచ్చిన కోహ్లీ.. అద్భుతరీతిలో డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో మున్రో షాక్‌కు గురైన మున్రో.. నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.

ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. భార‌త్ అన్ని రంగాల్లో రాణించి కివీస్ ను చిత్తు చేసింది. కివీస్ నిర్ధేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని మరో 2.3 ఓవర్లు మిగిలుండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8) విఫలమైనా సూపర్ ఫామ్ లో ఉన్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సులు) సమయోచితంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.Next Story
Share it