'ఐ ఫర్ ఇండియా'.. పాట‌లు పాడ‌నున్న రోహిత్, కోహ్లీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2020 12:20 PM GMT
ఐ ఫర్ ఇండియా.. పాట‌లు పాడ‌నున్న రోహిత్, కోహ్లీ

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైర‌స్ భారీన ప‌డి రెండున్న‌ర ల‌క్ష‌ల మందికి పైగా మృత్యువాత ప‌డ‌గా.. 35ల‌క్ష‌ల‌కు పైగా బాధితులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మ‌హ‌మ్మారికి ఇంకా మందును క‌నిపెట్ట‌లేదు. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించ‌డానికి చాలా దేశాలు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించాయి.

మ‌నదేశంలో కూడా ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 42,533 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 1,373 మంది మ‌ర‌ణించారు. లాక్‌డౌన్ కార‌ణంగా చాలా మంది పేద‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. కరోనా వైరస్​పై యుద్ధం చేసేందుకు 'ఐ ఫర్ ఇండియా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టీన‌టులు, సంగీత ద‌ర్శ‌కులు, గాయ‌కులు, క్రీడాకారులు, వ్యాపార‌వేత్త‌లు పాల్గొన‌నున్నారు. త‌మ ఇంటి ద‌గ్గ‌రి నుంచే ప్ర‌జ‌ల‌ను ఎంట‌ర్‌టైన్ చేసి నిధుల‌ను స‌మీక‌రించ‌నున్నారు. ఈ ఆన్​లైన్ సంగీత విభావరిలో టీమిండియా ​కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ పాల్గొన‌నున్నారు.

"లాక్‌డౌన్‌లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ఎంట‌ర్‌టైన్ చేసేందుకు, క‌రోనాపై యుద్దంలో ముందుండి పోరాటం చేస్తున్న వారి కోసం, ఉపాధి లేక ఇంట్లో ఇబ్బందులు ప‌డుతున్న వారి కోసం నిధులు సేక‌రించేందుకు భారత అతిపెద్ద సంగీత విభావరి నిర్వహించే పనిని రెండు వారాల క్రితం ప్రారంభించాం” అని ఐ ఫర్ ఇండియా ప్రకటించింది.

ఈ సంగీత విభావరిలో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్​, సానియా మీర్జా , షారూఖ్ ఖాన్, ఏఆర్ రెహ్మాన్​, జాకీర్ హుసేన్​, ఆమిర్ ఖాన్​, ఐశ్వర్య రాయ్ బచ్చన్​, ఆయుష్మాన్ ఖుర్రానా, బ్రయాన్ ఆడమ్స్, గుల్జార్, నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా జోనాస్ సింగ్, శ్రేయా ఘోషల్, సోను నిగమ్, సోఫీ టర్నర్, జోయా అక్తర్, విద్యా బాలన్, ఆలియా భట్​తో పాటు పలువురు నటులు, గాయకులు, సంగీత దర్శకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆన్​ద్వారా భాగస్వాములవనున్నారు. అందరూ తమ పాటలతో అభిమానులను అలరించనున్నారు.

ఇప్ప‌టికే టీమ్ఇండియా క్రికెట‌ర్లు క‌రోనా పై పోరుకు త‌మ వంతుగా సాయం అందించిన విష‌యం తెలిసిందే.

Next Story