బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతి.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 6:23 AM GMT
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతి.!

బంగ్లాదేశ్‌తో జరిగే టీ 20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ సేనకు విశ్రాంతినివ్వాలని సెలక్షన్‌ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. నవంబర్‌ 3 న సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ విషయం దక్షిణాఫ్రికాతో చివరి టెస్ట్‌ ముగిసిన తర్వాత సెలక్షన్‌ కమిటీ కోహ్లీతో మాట్లాడి నిర్ణయిస్తారు. అయితే తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలోనే సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ నుంచి జరిగిన 56 మ్యాచ్‌లకు గానూ 48 మ్యాచ్‌లల్లో కోహ్లీ పాల్గొన్నాడు. ఆటగాళ్లపై భారాన్ని తగ్గించడంలో భాగంగా విరాట్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తున్నారు.

Next Story