ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచ‌రీ చేశాడు. త‌యిజుల్ ఇస్లామ్ వేసిన 67వ‌ ఓవ‌ర్ నాలుగో బంతికి డ‌బుల్ తీసి కెరీర్ లో 27వ సెంచ‌రీ పూర్తీ చేశాడు. కోహ్లీ ఈ సెంచ‌రీకి 158 బంతులు తీసుకున్నాడు. అంత‌కుముందు.. హాఫ్ సెంచరీతో మంచి జోరుమీద కనిపించిన రహానే(51).. జట్టు స్కోర్ 236 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో హుస్సేన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోహ్లీ, రహానే జోడికి బ్రేక్ పడింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, జడేజా ఉన్నారు. ప్ర‌స్తుతం టీమిండియా 276/4 తో భారీ స్కోరు దిశ‌గా ప‌య‌నిస్తుంది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.