హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ బీభత్సానికి కోహెడ్‌ పండ్ల మార్కెట్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. సోమవారం సాయంత్రం పండ్ల మార్కెట్‌ షెడ్‌ కూలిపోయింది. దీంతో రేకులు సైతం దూరాన ఎగిరిపడటంతో పలువురు హమాలీలతో పాటు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలై వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమయానికి అంబలెన్స్‌ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచచింది. ఈ కారణంగా గాయాలైన వారికి ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు.

ఇక మార్కెట్లో సరైన సదుపాయాలు లేకపోవడం పట్ల రైతులు, హమాలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఉండే పండ్ల మార్కెట్‌ను కోహెడ్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాత్కాలిక షెడ్లను నిర్మించి పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. తీవ్ర గాలి, వాడ బీభత్సం సృష్టించడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *