తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఎక్క‌డా చెప్ప‌లేద‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విభ‌జ‌న చ‌ట్టంలొ పోల‌వ‌రం ప్రాజెక్టుకు మాత్ర‌మే జాతీయ హోదా ఇవ్వాల‌న్న అంశం ఉంద‌న్నారు. అందుక‌నే పోల‌వ‌రానికి జాతీయ హోదా క‌ల్పించామ‌న్నారు. దేశంలో కొన్ని పేద రాష్ట్రాలు ఉన్నాయ‌ని.. అయిన‌ప్ప‌టికి అక్క‌డ కూడా జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టులు లేవ‌న్నారు.

ఒక‌వేళ ఇత‌ర రాష్ట్రాల‌లో ఉన్న ప్రాజెక్టుల‌కు ఎక్క‌డ అయిన జాతీయ హోదా ఇచ్చిన‌ట్ల‌యితే.. తెలంగాణ ప్రాజెక్టుల‌కు కూడా జాతీయ హోదా వ‌చ్చే లా కృషి చేస్తాన‌ని అన్నారు. కేంద్రం ప్ర‌భుత్వంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన ఏడాది పాల‌న‌లోనే అనేక విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్నార‌న్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా త‌యారీ రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు అనేక ప్రోత్స‌కాలు అందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.