కశ్మీర్‌పై కేంద్రం ప్రత్యేక సర్వే: కిషన్ రెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 12:13 PM GMT
కశ్మీర్‌పై కేంద్రం ప్రత్యేక సర్వే: కిషన్ రెడ్డి

బెంగళూరు: ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగు పడుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కశ్మీర్‌పై కేంద్రానికి ప్రత్యేక దృష్టి ఉందన్నారు. కశ్మీర్‌ అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు రచిస్తుందని చెప్పారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రణాళిక కోసం ఓ బృందంతో సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాలను, పాఠశాలలను పునరుద్ధరించాలని కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. తొలి విడతలో 50వేల ఆలయాలను పునరుద్దరిస్తామన్నారు.

Dzgjus3vsaafe4l

గత పాలకులు, ఉగ్రవాదులు కశ్మీర్‌ను ధ్వంసం చేశారన్నారు. కశ్మీర్‌ను పునర్ నిర్మించే బాధ్యత కేంద్రం తీసుకుందన్నారు కిషన్ రెడ్డి.

Jammu 1

కశ్మీర్ యువకులకు ఉద్యోగాల కల్పనే తమ ధ్యేయమన్నారు. నేవీ, ఆర్మీలోకి కశ్మీర్‌ యువకులను తీసుకుంటామన్నారు. కశ్మీర్‌లో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Next Story