సౌత్ లోనే తొలిసారి అనంత నుంచి ఢిల్లీకి ఆ రైలు.. ప్రత్యేకత ఇదే

By సుభాష్  Published on  10 Sep 2020 6:31 AM GMT
సౌత్ లోనే తొలిసారి అనంత నుంచి ఢిల్లీకి ఆ రైలు.. ప్రత్యేకత ఇదే

దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి బయలుదేరిన ఒక ట్రైన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రైలు ప్రారంభానికి కేంద్ర రైల్వేశాఖా మంత్రి ఢిల్లీ నుంచి.. ఏపీలోని తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఏపీ మంత్రి శంకర్ నారాయణతో పాటు పలువురు అనంతపురం నుంచి ఒకే సమయంలో పాల్గొని జెండా ఊపి స్టార్ట్ చేసిన ఈ రైలు సో స్పెషల్ అని చెప్పక తప్పదు.

దేశ రాజధాని ఢిల్లీకి ఉద్యాన వన పంట ఉత్పత్తుల్ని రవాణా చేసే కిసాన్ రైలు తాజాగా ప్రారంభమైంది. దీని ప్రత్యేకత ఏమంటే.. ఈ రైలు బండిలో నేరుగా ఆయా ప్రాంతాల నుంచి వివిధ రకాల పండ్లను నేరుగా ఢిల్లీలోని అజాద్ ఫ్రూట్ మార్కెట్ కు తరలిస్తారు. తాజాగా అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ లో సీమలో పండే అరటి.. బత్తాయి.. బొప్పాయి.. దానిమ్మ తదితర పండ్లను ఈ రైలు ద్వారా తరలించారు.

రైతులకు వరంగా ఈ ట్రైన్ మారుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఈ రైలు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని.. వీటిని తగ్గిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేయగా.. అందుకు రైల్వే అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సౌత్ నుంచి తొలిసారి బయలుదేరిన కిసాన్ ట్రైన్.. అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరటం ఆసక్తికరమని చెప్పక తప్పదు.

Next Story