ఇక ఆ వార్త‌ల‌కు చెక్‌.. కిమ్ క‌న‌ప‌డ్డాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 May 2020 7:11 AM GMT
ఇక ఆ వార్త‌ల‌కు చెక్‌.. కిమ్ క‌న‌ప‌డ్డాడు..!

ఉత్తర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్.. ఆరోగ్యం విష‌మించింది.. చ‌నిపోయాడంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ ప‌డింది. గ‌త కొన్ని రోజులుగా అజ్ఞాత వాసంలో ఉన్న‌ కిమ్‌ జోంగ్‌ ఉన్.. 20రోజుల తర్వాత కనిపించారు. కిమ్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వెలువ‌డ్డాయి.

ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా రాజధాని న‌గ‌రం ప్యాంగ్‌యాంగ్‌ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగారం ప్రారంభోత్స‌వ కార్యక్రమంలో కిమ్‌ పాల్గొన్నట్టు కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కిమ్‌తోపాటూ అతని సోదరి కిమ్‌ యో జోంగ్ కూడా పాల్గొన్న‌ట్టు ప్ర‌భుత్వ అధికారులు పాల్గొన్నార‌ని స‌మాచారం.

ఇదిలావుంటే.. ఏప్రిల్‌ 15 నుంచి కిమ్‌ బయట ప్రపంచానికి కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.. ఓ ద‌శ‌లో చ‌నిపోయారంటూ ఫేక్ వార్త‌లు కూడా వెలువ‌డ్డాయి. వీట‌న్నింటికి ఊత‌మిస్తూ.. ఉత్తర కొరియాలో ఎంతో ఘ‌నంగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్‌ హాజరుకాలేదు. దీంతో పలు అనుమానాలకు తావిచ్చి.. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చజరిగింది.

Next Story